ఈ రోజు అక్షర శిల్పి, అక్షరకొరడాతో నిద్దరోతున్న సమాజాన్ని మేల్కొలిపేందుకు ఆఖరిశ్వాశ దాకా సాహితీప్రయాణం సాగించిన మనందరికి మిత్రుడు, శత్రువైన ఆధునిక భాష్యకారుడు పతంజలి గారి రెండవ వర్థంతి.. ఈ సందర్భంగా ఆయన గురించి ఎక్కువగా రాయలేని నా అజ్నానానికి సిగ్గుపడక ఆయన రాసిన ముక్కలలోంచే ఈ నాలుగుః
"ఆదియందు అక్షరముండెను. అది అబద్ధమై ఉండెను. అందువల్లనే అది అక్షయము, అక్షరము, అమరమూ అయివుండెను. అది పాలకుల వద్ద ఉండెను. ఆ అక్షరము నుంచి క్రమక్రమముగా అసత్య ప్రచారము పుట్టుకు వచ్చెను. అది ఏలిన వారి నాలుక చివరనె ఉండెను. ఏలినవారి అవసరార్థము వారి తాబేదారులు, మగధగణమూ, ఆ అసత్య ప్రచారమును రథములపై మోసుకుని తిరుగుచుండెను. ఏమీ అర్థం కాలేదా?"
ఐతే పతంజలి భాష్యము, నాకు తప్పదు కదా? అధ్యాయము, పేజీ 127 చదువుడు..
పతంజలి గారిని మర్చిపోవాలనే ఉంటుంది నాకు...లేకపోతే ఆయన సాహిత్యం కర్ర పట్టుకుని నా పక్కనే నిల్చుని నావి అల్పమైన రాతలు అని ఎత్తి చూపుతున్నట్లుగా ఉంటుంది నాకు...అందుకే.....
ReplyDelete