Wednesday, February 18, 2009
గాయమైన స్వప్నం
ఆహ్వాని౦చలేక పోతున్నాను!
ఆస్వాది౦చ లేకపోతున్నాను!
ఆన౦ది౦చ లేకపోతున్నాను!
అనుభవి౦చ లేకపోతున్నాను!
కడుపారా దుఖి౦చలేకపోతున్నాను..
కుమిలి కుమిలి దుఃఖం సుళ్ళు తిరిగి
కనులోయల్లోనే ఘనీభవిస్తో౦ది
రెటీనాకు అడ్డంగా ఏదో గ్లేసియర్
ఏదో......
బరువైనదేదో..
టన్నుల కొద్దీ భారమైనదేదో...
గు౦దెలపై కూచున్నట్టు౦టుది.....
వేల కొద్ది గుఱపు డెక్కల చప్పుడు
కర్ణభేరి పగిలిపోయేట్టు..
మెదడులో నరాలు తెగిపోయేట్టు
సిరలను౦డి రక్తాన్ని ఎవరో
సిరంజీలతో లాగుతున్నట్టు ......
దేనికి స్పందించలేని
స్ఫటికామాత్రపు కనులతో
ఎన్నాళ్ళీ క్షోభ.....
న్యూస్ ఎక్స్ ప్రెస్ , ఫ్లాష్ ఫ్లాష్,
క్రైమ్ ఫైల్, క్రైమ్ న్యూస్
యదార్థ వ్యదార్థ దృశ్యాల సమాహార౦తో
మెదడు పక్షవాతానికి గురౌతో౦ది...
కొయ్య గుర్రంపై స్వారీ
యింకెన్నాళ్ళు?
జీవశ్చవాలమై
శిలాజాలుగా మారిపోతున్నామా!
లీటర్ల గ్లిజరిన్ పోసినా
కన్నీళ్ళు రాని కనుపాపల లోయలు...
భూమిలో దిగబడిన రధ చక్రాన్ని
గాయమైన హృదయంతో
పైకెత్తుతూ...
పగిలిన కనుగుడ్లలో
గాయమైన స్వప్నం ............
Saturday, February 14, 2009
రెప్పలమాటున సూర్యోదయ౦
హోరున వర్షం
కుండపోత చి౦తగీరులమోత
కప్పుకున్న పోలితిన్ పై పడుతున్న
చినుకుల శబ్దం చెవులను
గి౦గుర్లెత్తిస్తో౦ది
మెరుపుల టార్చిలోంచి
చీకటిని చీలుస్తున్నాయి కళ్లు
శరీరమ౦తా రాడారై
శాత్రురాకను గుర్తి౦చే౦దుకు
నరాలన్నీ తీగలై
ఏ౦తెన్నాలవుతున్నై
అవును నేనొక్క రెప్పపాటు ఎమారితే
అలసిన జ౦కల్ని వేటాడటానికి తోడేళ్ళు
వేచి చూస్తున్నాయి
నాతోపాటు గుడ్లగూబ
తనకళ్ళను గు౦డ్ర౦గా
తిప్పుతూ చూస్తు౦తే
ముచ్చటేసి౦ది
చలికి మరి౦తగా చల్లబడుతూ వున్నా
కార్బన్ నా ఊపిరికి వేడెక్కుతూనే వు౦ది
ఆకురాలిన కాల౦
నా చూపు మరి౦త తిక్షనమవుతూ౦ది
పచ్చగా తనకడుపులో దాచుకునే
అడవి తల్లి వివస్త్రై
మమ్మల్ని బయటపదేస్తు౦ది
అ౦దుకే నేను మరి౦త
అప్రమత్త౦గా వు౦డాలి
నేను యిప్పుడు పదిమ౦ది
బిడ్డల్ని ఒకే కడుపులో
దాచుకున్న ని౦దు గర్భినిని
వేటకుక్కల దాడిను౦డి
సహచరులను కాపాడడమే నా విధి
చేతి గదియార౦ ముళ్ళ లయ
టిక్ టిక్ మని ప్రతి సెకను
ఎలర్ట్ చేస్తు౦ది
నా దేహమ౦తా స౦ధి౦చిన
బాణమయ్యి౦ది
ట్రిగ్గర్ పై నా వేలు బిగిసి౦ది....
నా రెప్పలమాటున
సూర్యోదయ౦ దాగివుంది....
Friday, February 13, 2009
నాకు ఇష్టమైన వాక్యం
దేదీప్యమాన౦గా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలనుకు౦టాను. మనిషన్నవాడు జేవి౦చాలి, బతుకేద్చద౦కాదు."
- జాక్ ల౦డన్
వెన్నెల గానం
అ౦తా భయ విహ్వలులై
ఒరుసుకు౦టూ, రాసుకు౦టూ, రాపాదుకు౦టూ
రొప్పుతూ, నెత్తురోడుతూ పరుగులేడుతున్నారు!
భయానక కాలమేఘ౦
వేగ౦గా కమ్ముకు౦టున్న దృశ్యం
కరల నాలుకపై
రక్త౦తో నగ్న దృశ్యాలను పులుముకు౦టూ
తనలోకాహ్వానిస్తు౦ది!
స్వేచ్చా వాయువులను బ౦ధిస్తూ
పావురాల రెక్కలను కరకరా విరిచేస్తు౦ది
తారుపూసిన రోడ్లపై జరజరా
పాకు౦టూ అనకొ౦దలా నోరుతెరుస్తూ.....
ఇటు చివర బక్కపలుచని
జ౦టొకటి సన్నని మెరుపుతీగలా
విల్ల౦బులను సవరి౦చుకు౦టూ
వెన్నెల గానాన్ని ఆలాపిస్తూ
ఎదురొస్తూ౦ది........
పదకొండో నంబర్ సీటు
అనకొ౦దలా౦టి ట్రైను కడుపులో ఒక కిటికీ మూల పదకొ౦దో న౦బరు సీటులో నేను........
ఒంటరి
అద్దంలో అదృశ్యం
పదే పదే చూస్తున్నాను
పరిచయస్తుదినైనా
అపరిచుతుడినైనా
కళ్ళలో కళ్లు పెట్టి నా రెటీనాపై
ఒక ఫోటో తీసుకొని
మస్తిష్కపు మెమొరీలో
నిక్షిప్తం చేసుకొనేందుకు
ప్రయత్నిస్తున్నా
ఎందుకంటే
నిన్నో, మొన్నో, నేడో, గంటో, నిమిషమో
ఈ క్షణం క్రితమో కన్పించినవాళ్ళు
మళ్ళీ కన్పిస్తారన్న నమ్మకం
కోల్పోయినవాన్ని
కరచాలనమిచ్చి స్వాగతించిన చేతులు
ఆప్యాయ౦గా ఆలి౦గనమ్ చేసుకున్న చేతులు
చిరునవ్వులతో పలకరించిన కళ్లు
మళ్ళీ సాక్షాత్కరిస్తాయా అని
యిలా ఎ౦దరినో కోల్పోయి
చివరాఖరుకు అద్ద౦ ము౦దు
నేను అస్పష్టంగా...
Tuesday, February 10, 2009
స్పేస్ ఫర్ కమ్యూనికేషన్
జీవితం ఎం.ఓ. ఫారంలోని
స్పేస్ ఫర్ కమ్యునికేషణ౦త
కుదించుకుపోవడంఎంత విశాదమోగదా
చిన్ని జాగాలోనే క్షేమ సమాచారాలు
పలకరించుకోడాలు
చేసేంత మరుగుజ్జుతనం
ఎంత దౌర్భాగ్యం
ఒకరినొకరు హృదయం విప్పి
పలకరిమ్చుకోలేనితనం
ప్రతిమాటకు ఎదోకనబడని
తేరా అద్దుపదుతు౦దదం
అంతా సవ్య౦గా సాగిపోతు౦దని
అనుకోలేని వెన్నడుతున్న
పిరికితనం
కనుచూపుమేరా చూసిన దృశ్యం
క౦టి వెనకాల అదృశ్యం
అంటీ ముట్టనట్టు కరచాలనం
ఎందుకింత అబద్ధం రాజ్యమేలుతోంది
మంచుతెర కమ్ముకుంటూ
గు౦దె కవాటాలను
బిగదీస్తో౦ది!!
పాటల విలుకాడు
అక్షరాలు అగ్నివర్షాలు కురిపి౦చనీ
పదాలు సాయుధ రధలి పరుగిదనీ
ఇక్కడ తప్పో-ఒప్పో, వెలుగో-చీకటో
జీవితమో-మరణమో, ఏదో ఒకటే శరణ్యం
పిరికివాడివా కాలమూ పట్టకూ, కత్తీ పట్టకూ
వెన్నెముక పూసలుజారి, బ్రతుకు చలిబారిన పడిందా
నీ పొడి పొడి మాటలు మాకొద్దు
నరాల్లో లావా పరుగులెత్తే వీరులు కావాలి మాకు
చూపుల్లొ౦చి మెరుపుల బాకులు విసిరే
మొనగాళ్ళు కావలి
ఇక్కడ ప్రశ్న దొ౦గ చాటుగా
నిర్జి౦పబదుతు౦ది
ఇక్కడ రాబ౦దులే న్యాయ నిర్ణేతలు
గోతికాడ నక్కలే వార్తాహరులు
ప్రతిక్షణం ఇక్కడ భయం వెనుక భయం
దెయ్యంలా వెంటాడుతుంది
అందుకే మాకు
పాటల విలుకాడు
కావాలి...
Saturday, February 7, 2009
వీలునామా
నా గొంతులో
అమృతపు చుక్కలు పోసి
పొత్తిళ్ళలో సేదదీర్చిన
నిన్ను ఎలా మరువగలనమ్మా
నీ వేళ్ళను అందుకొని
నీ అడుగులో అడుగునై
నేర్చా నీ నడక
అమ్మా అన్న బీజాక్షరాలలోంచే
భాష నేర్చుకొన్నాను
నీ లాలిపాటల్లోని
కరుణామయ
పల్లవులే నా కవిత్వం
నీ కష్టానికి ప్రతిరూపమీ
దేహం
నీవు కన్న కలల్ని ఆవిష్కరించడానికి
నేను సాయుదునిగా
తరలిపోయాను
నీలాంటి వీరమాతలెందరో
tama గుండెల గూడుల్లో దాచుకొని
గమ్యానికి చేరువగా
సాగనంపుతున్నారు
రేపటి సూర్యోదయం కోసం
నేడు నేను గున్కిపోక తప్పదు
తోలి వెలుగు రేకల్లో
గోదూలినై నిన్ను
చేరుకుంతానమ్మా
సెలవు....