Saturday, November 30, 2013

నీలం....

ఒక్కో సమయం అలా మూగగా వెదురు చుట్టూ తిరిగే గాలి సమీరంలా ఝుమ్మంటూ ఓ ఆవృతంలో తిరిగినా దరి చేరనితనంతో ఒంటరిగా ఈ గుబురులో దాగి పోతుంది

నువ్వప్పుడు కనుబొమలెగరేస్తూ కళ్ళతో ఓ పాటనలా ఆలపిస్తూన్న వేళ నది నీలంగా మారి ఓ పాయ అలా నీ పాదాల చుట్టూ నీలపు నురుగునద్దుతూ సాగిపోతుంది

అప్పుడలా నువ్వు ఆలవోకగా నీ చేయినలా నీ నల్లని ముంగురులను వెనక్కి నెడుతూ
ఆకాశంలోని కరి మబ్బులను నీ మునివేళ్ళపై ఆహ్వానిస్తూ మెరుపుల విల్లునలా వంచి వాన జల్లుని చివ్వున విసిరి మెలకువను యింత పసరికను పసుపుగా అద్ది పోతుంది

అడవి దారుల ఇప్పవనాల వెంట మత్తుగా నీ మెడ చుట్టూ చేతులు వేసినట్టు ఫక్కున నవ్వుతూ చందమామను ఆ ఇరిడి తోపులోకి నెట్టి నల్లని ఈ మట్టి చెమ్మలో దేహాన్ని ఆరబెడుతూ నగ్నంగా సేదదీరే వేళ ఆకులన్నీ రాలి పసరు వాసన వేస్తూంది.

యుగాలుగా మర్చిపోయిన జ్నానమేదో మేల్కొని భూమిలోకి పాకిన ఈ చిగురు వేళ్ళ గుండా ఓ సుగంధాన్ని వెదజల్లుతూ అనంతమైన ఆవృతాన్ని సృష్టిస్తూ చుట్టూ నీ చుట్టూ యిన్ని దీపపు కాంతులను వత్తులుగా వెలిగిస్తూ మట్టి పాత్రలోకి తోడ్కొని పోతుంది

అప్పుడు ఈ ఇసుకమన్ను కలిపిన దారులలో వేకువ ఝామున ఊదారంగు మబ్బు చినుకునలా దోసిటపట్టి వీడ్కోలు పలుకుతూ కొన్ని పూల రెమ్మలను అలంకరిస్తూంది..

(30-11-13 రా 11.30)

9 comments:

  1. మీ వెన్నెలదారిలో మరోకోణంలా ఉందండి కుమారవర్మగారు....చాలా బాగారాశారు.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు ప్రేరణ గారు..

      Delete
  2. Replies
    1. ధన్యవాదాలండీ యోహాంత్ గారు..

      Delete
  3. చాలా బాగుంది... వర్మ గారు

    ReplyDelete
  4. మీభావాలు చాలా బాగుంటాయి. మరెందుకో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది

    ReplyDelete
    Replies
    1. ముందుగా మీకు స్వాగతం. నా రాతలపై తమ స్పందన తెలియ చేసినందుకు ధన్యవాదాలు శ్రీపాద గారు.

      Delete
  5. Beautiful feel with da essence of life.....n defining da end of life.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...