Monday, October 24, 2011

ఆమెకు వందనం



ఆమెను చూసినప్పుడల్లా
లోలోన గుండెనరం
ఒక్కసారిగా బాధగానో సంతోషంతోనో
మెలికపెడుతూంది....

పురిటి వాసనేస్తూ పురా జ్ఞాపకాల్నీ
ఒక్కసారి పేగు బంధంలా చుట్టుముడుతు
ఉక్కిరిబిక్కిరి చేస్తాయి...

నాకై నేను అప్పుడే చంటి పిల్లాడిలా మారి
అల్లరి చేసి చీవాట్లు తినాలనిపిస్తుంది!
విసుగు రాదే తనకి....

అల్లంతలోనే ఎప్పుడో నాకు దూరమైన
దేవత నా కనులముందు ప్రత్యక్షమై
నాలోలోపలి అలజడినంతా
తన వెచ్చని చేతిలోకి తీసుకొని
హ్యారీ పోటర్ లా విశ్వాంతరాల అంచులలోకి
తోడ్కొని పోయి
వెన్నెల లోని చల్లదనమంతా
తన చూపులలో వర్షించి
నన్ను కాంతిమంతం చేస్తూ
పరిమళభరితం చేయిస్తుంది....

ఆ స్త్రీ మూర్తికి వందనం....

6 comments:

  1. chaalaa bagundi kondodaa....aameki vandanam.....love j

    ReplyDelete
  2. అజ్ఞాత: thank u maaaaaaaaaaaaaa.........

    ReplyDelete
  3. "విశ్వాంతరాల అంచులలోకి
    తోడ్కొని పోయి
    వెన్నెల లోని చల్లదనమంతా
    తన చూపులలో వర్షించి
    నన్ను కాంతిమంతం చేస్తూ" చాలా బాగుంది తమ్ముడూ

    ReplyDelete
  4. ధన్యవాదాలు జ్యోతక్కా...

    ReplyDelete
  5. narra .venu gopalOctober 26, 2011 6:02 AM

    ఆ స్త్రీ మూర్తి రూపం పేరు అమ్మ అక్క చెల్లి
    అండ్ నన్ ఆదర్ దాన్ భార్య కూడా

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...