ఆదర్శం....
దేహమంతా గాయాల మయమైనా
పాడే వేణువు ఆదర్శం కావాలి....
నిర్బంధం ఎంతగా ఉక్కుపాదం మోపినా
గొంతు చించుకు వచ్చే నినాదం కావాలి...
నిషేధాలు ఎన్ని ఇనుప తెరలల్లినా
పొద్దు పొడుపులా పొడుచుకు వచ్చే వాక్యం కావాలి....
పెడరెక్కలు విరిచికట్టి కళ్ళలో గుండు సూదులు గుచ్చి
గుండెల్లో గురిపెట్టినా సత్యం వాక్కు కావాలి....
పాటల పల్లవిలో ప్రతి చరణంలో
నీ హృదయం నిక్షిప్తమై అజరామరం కావాలి....
(ఇలా రాసి చాలా రోజులయ్యింది...)
చాలాబాగుంది!
ReplyDelete@Padmarpita garu thanksandi..ఎన్నాళ్ళకు మీ వ్యాఖ్య..చాలా ఆనందంగా వుంది...
ReplyDelete