Saturday, October 15, 2011

భారం




ముప్పిరిగొన్న ఆలోచనలు!
మదిలో కమ్ముకున్న కారు మేఘాలు....

ఏదో కీడు శంకిస్తూ మనసంతా బాధగా మూలుగు
జవసత్వాలన్నీ సడలి ప్రాణం గిలగిలలాడుతున్నట్టు...

కాలం అక్కడే ఆగి వెక్కిరిస్తున్నట్టు...
గూడు అల్లిక మాని సాలెపురుగు కంట్లోకి చూస్తున్నట్టు...

ఉబకని కన్నీటి చుక్క కంటిపాపకు అడ్డంగా...
కాలికింద నేల బద్దలౌతూ లాక్కుంటున్నట్టు...

పండిన ఆకు నేలరాలజూస్తున్నట్టు
గాలి నిశ్శబ్ధాన్ని బిగబట్టి ఆగిపోజూస్తున్నట్టు....

గుండెలపై భారంగా ఏదో అణచిపెట్టినట్టు
ఇలా ఈ దినం ముగియనీ...

2 comments:

  1. ఉబకని కన్నీటి చుక్క కంటిపాపకు అడ్డంగా...
    బాగుందండీ!

    ReplyDelete
  2. @రసజ్ఞ గారూ ధన్యవాదాలండీ...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...