Sunday, October 16, 2011

అసంపూర్ణ పద్యం...


జ్నాపకాలన్నీ గోడలో
మేకు వేసి వేలాడగట్టలేని నిస్సహాయత...

అలా తెరచాప చిరుగులతోనే నావలో పయనం
విరిగిపోతున్న తెడ్డు అలా ముందుకు నెట్టుతూ...

గాలి ఊసులేవీ వినబడనీయక ఉక్కపోతవేస్తూ
సంద్రం మధ్యలో దాహంతో నాలుక పిడచకట్టుతూ...

గొంతులో పాట సుళ్ళు తిరుగుతూ మూలుగుతూ
విరిగిన పాళీ రాయలేని ప్రేమలేఖ జేబులో సగం ముక్కలా...

మబ్బులన్నీ ఒక్కసారిగా దండుగా విసురుగా వస్తూ....
కంటిపై రేఖా మాత్రంగా విద్యుత్ కాంతి మసకబారుతూ....

కలలన్నీ సగానికి విరిగిపడుతున్న అలలై తీరాన తలబాదుకుంటూ...

వెలిసిన రంగులద్దిన ఆకాశం మసక చీకటిలో వెలవెలబోతూ
ఇదో అసంపూర్ణ పద్యంలా కరిగిపోనీయని మంచుగా యిలా....

6 comments:

  1. మనసు పడే అవ్యక్తమైన ఆర్తిని బాగా పట్టేరు. ప్రతి పాదంలోనూ ఒక అసంతృప్తినీ, ఒక అసంపూర్ణతనీ ఆవిష్కరించేరు. కానీ ఈ పాదంలో
    "మబ్బులన్నీ ఒక్కసారిగా దండుగా విసురుగా వస్తూ
    కంటిపై రేఖా మాత్రంగా విద్యుత్ కాంతి మసకబారుతూ.... "

    అన్న చోట మబ్బులు చెయ్యవలసిన పని అసంపూర్ణమని అవిష్కరించవచ్చేమో అనిపించింది. ఆలోచించండి. లేనపుడు భావపరంపరకు break ఇస్తూ... ఒక విరామ చిహ్నం ఇచ్చినా సరిపోతుంది. Because the idea expressed here is beautiful in itself
    చివరి పాదంలో 'వెలసిన ' అన్న మాటకు faded అన్న అర్థం ఉన్నట్టు లేదు. అది 'వెలిసిన' అని ఉండాలి అని నా భావన.
    మొత్తం మీద ఇది చాలా చక్కని చిక్కనైన భావన. అభినందనలు.
    మూర్తి

    ReplyDelete
  2. @teluguanuvaadaalu : నా వాక్యాలను మీ ఆత్మీయ విశ్లేషణతో పరిపూర్ణం చేసారు...వెలసిపోయింది అని మామూలుగా అనేస్తుంటాం కదా సార్..అందుకే రాసినప్పుడు అలా వచ్చేసింది...సవరించుకుంటా...ధన్యవాదాలు....

    ReplyDelete
  3. mee bhaavam bhaashyam rendu aartigaa unnayi kumar garu ....love j

    ReplyDelete
  4. manchi poem chadivina thrupti ...wonderfil varma gaaru..!

    ReplyDelete
  5. kavi yakoob: mee comment pondadam chaalaa aanandamgaa vundi sir...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...