తన నుదుటిపైన ముద్దుడితూ నాన్నా
అని నేను ఆక్రోశిస్తున్నా నన్ను నిర్దయగా
విడిచి దీపమైన నాన్న....
నా అరిపాదం గాయపడకుండా
తన గుండెలపై ఆడించిన నాన్న..
తన ఒడిలో కూచుండబెట్టి అక్షరభ్యాసం
చేయించిన నాన్న....
ఎప్పుడూ నీడలా వెన్నంటి వుండి
తన మాటల బాట వెనకే
నడిపించిన నాన్న....
నేడు నా చేత పసుపు నీళ్ళ స్నానానికి
ఒదిగిపోయిన క్షణాలు...
ఆ పాదాలను చివరిసారిగా కన్నీటితో
కడిగిన క్షణాలు...
చివరిసారిగా తన చుట్టూ చుట్టిన కాషాయ వస్త్రం కాంతులీనుతూ
ఒడలంతా విభూది పూసి పవిత్ర పత్రాల మధ్య
తేజోవంతమైన దేహం సజీవంగానే ఒరిగిన క్షణాలు....
నా గుండెకింత నిబ్బరమెక్కడిది???
ఇది ఆయన చివరిగా గట్టిగా ఒత్తిన స్పర్శకదా???
అని నేను ఆక్రోశిస్తున్నా నన్ను నిర్దయగా
విడిచి దీపమైన నాన్న....
నా అరిపాదం గాయపడకుండా
తన గుండెలపై ఆడించిన నాన్న..
తన ఒడిలో కూచుండబెట్టి అక్షరభ్యాసం
చేయించిన నాన్న....
ఎప్పుడూ నీడలా వెన్నంటి వుండి
తన మాటల బాట వెనకే
నడిపించిన నాన్న....
నేడు నా చేత పసుపు నీళ్ళ స్నానానికి
ఒదిగిపోయిన క్షణాలు...
ఆ పాదాలను చివరిసారిగా కన్నీటితో
కడిగిన క్షణాలు...
చివరిసారిగా తన చుట్టూ చుట్టిన కాషాయ వస్త్రం కాంతులీనుతూ
ఒడలంతా విభూది పూసి పవిత్ర పత్రాల మధ్య
తేజోవంతమైన దేహం సజీవంగానే ఒరిగిన క్షణాలు....
నా గుండెకింత నిబ్బరమెక్కడిది???
ఇది ఆయన చివరిగా గట్టిగా ఒత్తిన స్పర్శకదా???
అవును దీపాలే అవుతారు పొయిన పెద్దలంతా
ReplyDeleteఆకాశ దీపాలు !!
ఉన్నప్పుడు ఎలా ఉన్నా
పోయాక ఏదో ఒక నిశబ్ద రాత్రి..
ఏదో ఒక దిక్కు తోచని సమస్య లో.
డాబా పైకెళ్ళి ఆకాశం లోకి చూస్తే మిణుక్కుమనే నాన్న..
వెలుగు దారి చూపే నాన్న..
బతుకంతా వెలిగి ఆరిపోయే కొవ్వేత్తే నాన్న.
heart touching
ReplyDeleteNice One
ReplyDelete@ఆత్రేయ గారూ మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..మీరన్నది ముమ్మాటికీ నిజం "వెలుగు దారి చూపే నాన్న..
ReplyDeleteబతుకంతా వెలిగి ఆరిపోయే కొవ్వేత్తే నాన్న".
@మనోవాంచ గారూ ధన్యవాదాలు....
ReplyDelete@Subha గారు ధన్యవాదాలు...
నేను మొదటిసారిగా ఒక తండ్రిని ఇంతగా ఆరాధించే తనయున్ని చూసాను మీ ఈ కవితలో వర్మగారు.
ReplyDeleteనాకున్న ఒకే ఒక్క ఆసరాను కోల్పోయి యిలా మిగిలివున్న దైన్యంలోని నిస్సహాయతండీ పద్మ గారూ...
Delete