పోస్ట్ కార్డ్..
ఓ చిన్న చిట్టీ నిండా
ఇన్ని కబుర్లు నింపి
నీ అంతరంగాన్నంతా
మధించి కాసిన్ని
అమృతపు చుక్కలు జల్లి
రాసిన ఆ నాలుగు
మాటలు
ఓ స్నేహితుడా క్షేమమా!
అన్న నీ పలకరింపు
ఎంత పులకరింతగా వుండేది...
ఆ ఎదురు చూపుల
తీయదనం తిరిగి రాదేమి?
మడత పెట్టి జేబులో
గుండెకు దగ్గరగా వుంచుకొని
మధ్యలో తడుముకుంటూ
నీ వెచ్చని స్పర్శను
అనుభూతిస్తూ నడిచే వేళ
ఆ మమకారం కళ్ళలో
వెలుగును నింపేది...
ఎక్కడ దాగిపోయాయివన్నీ??
బాబూ పోస్ట్
అన్న పిలుపే కరువై
పసుపురాయని గుమ్మంలా
వెల వెల బోయింది....
బాబూ పోస్ట్
ReplyDeleteఅన్న పిలుపే కరువై
పసుపురాయని గుమ్మంలా
వెల వెల బోయింది....
well said
@kallurisailabala: thank u Madam..
ReplyDeleteఉత్తరం ఇంకా బ్రతికే ఉందని ఆకాశవాణికి శ్రొతలు వ్రాసే లేఖలలో అనిపిస్తుంది నాకు. మీరు అన్నట్తు ఉత్తరం కోసం పడిగాపులు. కవిత చాలా బాగుంది..వర్మ గారు.
ReplyDeleteవనజ వనమాలిః ధన్యవాదాలు మేడం..
ReplyDeleteuttaraala yuga mugisinaa?? ani nenoo oka post raassanandi..manam andaram miss avutunnaam,,kaani em hope ledu, ee net yugam lo postal letters ki.
ReplyDeletevasantham.
@vasantham: thanksandi..mee spandananu share chesukunnaanduku..postal dept undigaa...appudappudu ilaa uttaraalu raayadaaniki prayatnistu maname batikinchudaam..
ReplyDeleteమా ఈ పలకరి౦తలో మీకు ఉత్తరం కనిపించట్లేదా, చదువుతున్న మీ కళ్ళలో వెలుగులు ని౦పట్లేదా..రూపమే మారింది పలకరింపు మారలేదు. ఒక్క భావం వేయి రూపాలెత్తి మీ బాధను పంచుకుంటోంది.
ReplyDelete