Thursday, September 1, 2011

ఇప్పుడో వాక్యం కోసం వెదుకుతున్నా.....

ఇప్పుడో వాక్యం కోసం వెదుకుతున్నా....

మనసులోని వ్యాకులతను పారదోలి
వెలుగును నింపే వాక్యం కోసం...

అక్షరారణ్యంలో లేలేత చిగుళ్ళుగా
విచ్చుకునే వాక్యం కోసం.....

మడుగులోంచి విచ్చుకునే స్వచ్చమైన
పద్మంలాంటి వాక్యం కోసం....

ఆలోచనల సాలెగూడును తెంచుకు వచ్చే
దివిటీలాంటి వాక్యం కోసం....

ఎదనిండా నిబ్బరాన్ని నింపే
స్నేహితుని లాంటి వాక్యం కోసం....

రారమ్మని హృదయమంతా ప్రేమ నింపే
ప్రేయసిలాంటి వాక్యం కోసం....

నరాలలో లావాను పరుగులెత్తించే
అగ్నిపునీతలాంటి వాక్యం కోసం....

కోటి నినాదాల హోరును వినిపించే
కాంతిపుంజంవంటి వాక్యం కోసం
వెదుకుతున్నా...

.....



6 comments:

  1. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

    శిరాకదంబం వెబ్ పత్రిక

    ReplyDelete
  2. poem naaku nacchindi varma gaaru.ఎదనిండా నిబ్బరాన్ని నింపే
    స్నేహితుని లాంటి వాక్యం కోసం.... baagundi..

    ReplyDelete
  3. @yakoob ః మీ వ్యాఖ్య పొందినందుకు చాలా ఆనందంగా వుంది సార్...ధన్యవాదాలు...

    ReplyDelete
  4. "కోటి నినాదాల హోరును వినిపించే కాంతిపుంజం", ikkada kaantipunjam emiti? Surya kiranamaa? Ekkadaa kaanti punjam koti ninaadaalanu vinipinchade?

    Emainaa tappulu unte kshaminchandi.

    Mee ee kavita prakruti loni swachchatanu, manishi manasuloni cheekatini paaradrole velugunu melavinchina oka madhura kavitaa bhaavana.

    ReplyDelete
  5. samaranaadam ante baavuntundemo, kaantipunjam kante. Adi kavitani chivaraku kooda teesuku velutundi.

    ReplyDelete
  6. Salahuddin: Thanks for your kind suggestion Madam...కాంతిపుంజాన్ని ఓ abstract notion గా తీసుకున్నా...మిన్నంటిన నినాదాల హోరును చెప్పేట్టు...క్షమించడాలెందుకు...తప్పేమీ కాదుగా...మళ్ళీ చెక్ చేసుకుంటా...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...