Wednesday, September 7, 2011

దేహమే ఓ నేత్రమై...



ఇక్కడేదో పోగొట్టుకున్నాను అనుకొని ఒక్కటే మనసులో గుబులు...

ఎక్కడ వెతికినా కానరాదేమీ......

పోగొట్టుకున్నదేదో తెలియనిదే ఏమని వెతకను.....

అయినా ఆగదే వెతుకులాట......

చేతిలో లాంతరు పొగ మారి మసక బారుతున్నా దేహమే నేత్రమై వెతుకుతున్నా....

లోలోపల గాఢ మైన సాంద్రమైన సంద్రంగుండా అలల తెప్పలపై కదులుతూ....

అమేయమైన దీర్ఘ నిర్నిద్ర రాత్రుల గుండా చీకటి సాలెగూడు తెరలను తెంపుకుంటూ.....

నేతగాని మునివేళ్ళ మధ్య గుండా విడిపోతున్న దారాల ముడులులా....

సుడిగుండాల మధ్య నుండి పైపైకి దూసుకు వస్తున్న వేటగానివోలె......

ఇంతలో సన్నని వెన్నెల కిరణమొకటి దారుల గుండా వెలుతురు నింపుతూ.......

(అసంపూర్ణం)

4 comments:

  1. Great! Idi oka jeevi yokka jeevitamlo antam kosam vedukulaata, ae rakamaina antamainaa kaavachchu. Ila anukovadam okena? Kavi hrudayam teliyacheyyandi.

    ReplyDelete
  2. Mukhyamgaa tanedo teliyani sthiti ninchi, edo gamanaanni, gamyaanni aasistoo manishi chivaraki cheraalsina okae gamyaanni ponde kramamlo unna tarjana bharjana.

    ReplyDelete
  3. "నేతగాని మునివేళ్ళ మధ్య గుండా విడిపోతున్న దారాల ముడులులా...." ante? Idi naa vyaakhyaanam lo ela saripotundi? Netagaadu evaru, devudaa, jeevudaa? devudu mana life lo oka pani vaadilaa skillful gaa changes chestaada? Aina, ee kavita lo devuni prasakti enduku? Oka vela jeevudaithe, netagani panithanaanni ee confusion lo choopinchatam avasaramaa?

    ReplyDelete
  4. Salahuddin: సర్...మీరు నా కవితను విశ్లేషించిన తీరుకు ధన్యవాదాలు..నిజమే ఒక్కోసారి నాలోనేను ఎదుర్కొనే ఒక మానసిక శోధన ఇలా ఈ రూపం తీసుకొంది...దేవుని ప్రస్థావన కాదు నేతగాడుని ఓ సామాన్య శ్రామికుని చేతులలో విడిపోయే సమస్యామూలాలను చెప్దామనుకున్నా..అది తాత్వికంగా అలా చేరింది మీకు...థాంక్యూ....

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...