నీవా? నేనా??
కుప్ప బోసిన కలల్లోంచి
ఏరుకుంటున్న జ్ఞాపకాలు....
తడిగా నెత్తురంటిన శిశువు దేహంవలె
పురిటి వాసనేస్తూ
తల్లి పేగులా మెడ చుట్టూ...
తెగిపడని ఆలోచనల సంకెలలోంచి
ఒక్కో మెలిక గట్టిగా ఒరుసుకుంటూ...
గురుతుల చేద వేస్తున్నా అందని నీళ్ళ బావిలా
లోతుగా....
నల్ల మబ్బుల లోంచి సగం కోసిన వెన్నలలా
తొంగి చూస్తూ...
కాగితంపై ఒలికిపోయిన రంగుల లోంచి
గాడంగా ఓ చెరిగిపోని చిత్రం....
నీవా? నేనా?
neeve thelusukovaali mari....love j
ReplyDeletedhaathri: thank u madam..
ReplyDeleteనల్ల మబ్బుల లోంచి సగం కోసిన వెన్నలలా
ReplyDeleteతొంగి చూస్తూ...
మీ వర్ణన బాగుంది!
@రసజ్ఞ గారు ధన్యవాదాలు...
ReplyDeleteఏమో??? ఎవరైనా..భావం మాత్రం భలేబాగుంది!
ReplyDeleteయిన్నాళ్ళ తరువాత మీ కామెంటుకు నోచుకోవడం బాగుంది...ధన్యవాదాలు పద్మగారు..
ReplyDelete