కంటికి రెప్పలా
గుండెకు పంజరంలా
నీకూ నాకూ మధ్య
ఈ సన్నని తెర ఏదో మన మధ్య
అతికీ అతకని బంధాన్నేదో
అలా దాస్తూ ఏమారుస్తూ
యుగాలుగా నీ మమతానురాగాల్ని
అలా మల్లెతీగలా చిగురింప జేస్తూ
పూస్తూ
వెన్నెల జాజిలా
వసంతమంతా విస్తరిస్తూ
నిన్నూ నన్నూ
ఇలా చెరో వైపు నిలుపుతూ....
No comments:
Post a Comment
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..