మిగలనీ కాసింత కన్నీళ్ళనీ చిగురంత చిర్నవ్వునీ...
అప్పుడప్పుడూ హృదయాన్ని శుభ్రపరచే వసంత మారుతాన్ని శ్వాశించనీ.... బిగబట్టిన ఊపిరిని నీ ఒడిలో ఉప్ మని వదిలి
సేదదీరనీ... ప్రియమైన నీ శతృత్వంలో స్నేహజగడాలలోంచి మాధుర్యాన్ని వెదకనీ.... కట్టుకున్న ఈ కలల నేతల గిజిగాడి గూడు గదులలో పారాడిన నీ కాలి అందెల సవ్వడితో తెలవారనీ... ప్రియమైన శతృవా నీ పెదవి చిగురున నాటిన గాయం తేనెలూరుతూ బాహుబంధంలో నన్ను బందీకానీ.... ఈ జగడం జీవిత కాల ఖైదుగా నీ చెంత మిగలనీ....