
రాశి పోసావిన్ని పూలను
కానీ నా కనులకు నెత్తురంటిన
జేగురు చెమ్మ తగిలి గాయం రేగుతోంది
పదాల మధ్య అతకని దారమేదో తెగుతూ
నిశ్శబ్దాన్ని మెత్తగా కోస్తోంది
ఆకులన్నీ రాలుతున్న చప్పుళ్ళ
మధ్య ఒకింత ఖాళీ ఏర్పడి గాలి ఊసులేవొ గుసగుసగా
రాతి పొరలమధ్య నీ ఉలికి
చెందని శిల్పమేదో ఆవిష్కృతమవుతోంది
నెమ్మదిగా ఈ మట్టి వేళ్ళ మధ్య పారే నీటిని
దోసిలితో పట్టి గాయపడ్డ
ఈ వెదురు గొంతులో ఒంపి పాటగా సాగిపో..
కానీ నా కనులకు నెత్తురంటిన
జేగురు చెమ్మ తగిలి గాయం రేగుతోంది
పదాల మధ్య అతకని దారమేదో తెగుతూ
నిశ్శబ్దాన్ని మెత్తగా కోస్తోంది
ఆకులన్నీ రాలుతున్న చప్పుళ్ళ
మధ్య ఒకింత ఖాళీ ఏర్పడి గాలి ఊసులేవొ గుసగుసగా
రాతి పొరలమధ్య నీ ఉలికి
చెందని శిల్పమేదో ఆవిష్కృతమవుతోంది
నెమ్మదిగా ఈ మట్టి వేళ్ళ మధ్య పారే నీటిని
దోసిలితో పట్టి గాయపడ్డ
ఈ వెదురు గొంతులో ఒంపి పాటగా సాగిపో..
ReplyDelete"
" ఆకులన్నీ రాలుతున్న చప్పుళ్ళ
మధ్య ఒకింత ఖాళీ ఏర్పడి గాలి ఊసులేవొ గుసగుసగా
రాతి పొరలమధ్య నీ ఉలికి
చెందని శిల్పమేదో ఆవిష్కృతమవుతోంది "
మంచి భావం .
ఎంతటి నిశ్శభ్దం లో నైనా రాగాలను వినిపించే
మీ రచనా శైలిని అభినందిస్తున్నాను.
చాలా బాగా మలిచారు మీ బావాలను
అభినందనలు మీకు వర్మ గారూ.
*శ్రీపాద
ధన్యవాదాలు శ్రీపాద గారు.. మీ మాట స్ఫూర్తిదాయకం..
ReplyDelete