దీపస్తంభాన్నెవరో ఎత్తుకు పోయినట్టున్నారు
ఈ గోడ చీకటి నీడ కప్పుకుని వుంది
కాళ్ళు రెండూ ముడుచుకుని డొక్కలోకి తన్నిపెట్టి ఆకలిని చంపుతూ
చినిగిన దుప్పటి యింత వెన్నెలను లోపలికి చొరబెడుతూ
చల్లని స్పర్శనేదో ఒకింత పులుముతున్నట్టుంది
చిన్నగా మెలకువని మింగి ఏదో మగతనిద్రలో కలవరిస్తూ
దేహాన్ని విరమించిన వేళ కాసింత విశ్రాంతిని మిగిల్చి
ముసురుకున్న కలల కత్తి అంచు మీద మనసు నాట్యం చేస్తూ
ఊపిరి స్వరం నెమ్మదిగా చివరి వత్తినంటిన చమురులా
ఈ అసంపూర్ణ పద్యాన్నిలా కత్తిరించి కాసేపు
గాలిపటంలా ఎగరేసి తోకచుక్కను తాకాలని
ఓ అసహజ ప్రయత్నమేదో చేయబూనుతూ
అసంపూర్న పద్యమే...గుండె చివరి శ్వాసవరకూ పూర్తి కాని చిత్రాలివి,
ReplyDeleteకవి హృఉదయాన్ని కెలుకుతున్న గాయాలివి,
చాలా బాగుంది, వర్మగారూ,
ధన్యవాదాలు ఫాతిమాజీ..
ReplyDeleteవండర్ఫుల్ కవిత మీ కలం నుండి చాన్నాళ్ళకి జాలువార్చారు. అభినందనలు
ReplyDeleteThank you Srujana gaaru.. chaannaallaki blog vaipu chusaaru.
Delete
ReplyDelete" దేహాన్ని విరమించిన వేళ కాసింత విశ్రాంతిని మిగిల్చి
ముసురుకున్న కలల కత్తి అంచు మీద మనసు నాట్యం చేస్తూ
ఊపిరి స్వరం నెమ్మదిగా చివరి వత్తినంటిన చమురులా."
మంచి భావనలతో కవితను ఆసాంతం చాలా
ఘంభీరంగా కదిలించారు .
బావుంది మీ కవిత వర్మ గారూ
*శ్రీపాద
మీ ఆత్మీయ వాక్కుకు ధన్యవాదాలు శ్రీపాద సార్..
Deleteమీ బ్రాండ్ మార్క్ లో బ్రహ్మాండమైన కవిత
ReplyDeleteథాంక్యూ తెలుగమ్మాయి గారు..
Deleteచినిగిన దుప్పటి యింత వెన్నెలను లోపలికి చొరబెడుతూ
ReplyDeleteచల్లని స్పర్శనేదో ఒకింత పులుముతున్నట్టుంది
చిన్నగా మెలకువని మింగి ఏదో మగతనిద్రలో కలవరిస్తూ,,,లవ్ దిస్
థాంక్యూ అనికేత్.. మీకిలాంటివి నచ్చవనుకున్నా...
Deletechalaa baagundandi
ReplyDeleteధన్యవాదాలు రమేష్ గారు..
DeleteNice background song and poem also
ReplyDeleteThank you Mytri garu.. _/\_
Deletenice
ReplyDelete