Saturday, May 24, 2014

దేహాన్ని విరమించిన వేళ..


దీపస్తంభాన్నెవరో ఎత్తుకు పోయినట్టున్నారు 
ఈ గోడ చీకటి నీడ కప్పుకుని వుంది
కాళ్ళు రెండూ ముడుచుకుని డొక్కలోకి తన్నిపెట్టి ఆకలిని చంపుతూ 

చినిగిన దుప్పటి యింత వెన్నెలను లోపలికి చొరబెడుతూ 
చల్లని స్పర్శనేదో ఒకింత పులుముతున్నట్టుంది
చిన్నగా మెలకువని మింగి ఏదో మగతనిద్రలో కలవరిస్తూ

దేహాన్ని విరమించిన వేళ కాసింత విశ్రాంతిని మిగిల్చి
ముసురుకున్న కలల కత్తి అంచు మీద మనసు నాట్యం చేస్తూ
ఊపిరి స్వరం నెమ్మదిగా చివరి వత్తినంటిన చమురులా

ఈ అసంపూర్ణ పద్యాన్నిలా కత్తిరించి కాసేపు 
గాలిపటంలా ఎగరేసి తోకచుక్కను తాకాలని 
ఓ అసహజ ప్రయత్నమేదో చేయబూనుతూ 

15 comments:

  1. అసంపూర్న పద్యమే...గుండె చివరి శ్వాసవరకూ పూర్తి కాని చిత్రాలివి,
    కవి హృఉదయాన్ని కెలుకుతున్న గాయాలివి,
    చాలా బాగుంది, వర్మగారూ,

    ReplyDelete
  2. ధన్యవాదాలు ఫాతిమాజీ..

    ReplyDelete
  3. వండర్ఫుల్ కవిత మీ కలం నుండి చాన్నాళ్ళకి జాలువార్చారు. అభినందనలు

    ReplyDelete
    Replies
    1. Thank you Srujana gaaru.. chaannaallaki blog vaipu chusaaru.

      Delete

  4. " దేహాన్ని విరమించిన వేళ కాసింత విశ్రాంతిని మిగిల్చి
    ముసురుకున్న కలల కత్తి అంచు మీద మనసు నాట్యం చేస్తూ
    ఊపిరి స్వరం నెమ్మదిగా చివరి వత్తినంటిన చమురులా."

    మంచి భావనలతో కవితను ఆసాంతం చాలా
    ఘంభీరంగా కదిలించారు .
    బావుంది మీ కవిత వర్మ గారూ

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ వాక్కుకు ధన్యవాదాలు శ్రీపాద సార్..

      Delete
  5. మీ బ్రాండ్ మార్క్ లో బ్రహ్మాండమైన కవిత

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ తెలుగమ్మాయి గారు..

      Delete
  6. చినిగిన దుప్పటి యింత వెన్నెలను లోపలికి చొరబెడుతూ
    చల్లని స్పర్శనేదో ఒకింత పులుముతున్నట్టుంది
    చిన్నగా మెలకువని మింగి ఏదో మగతనిద్రలో కలవరిస్తూ,,,లవ్ దిస్

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ అనికేత్.. మీకిలాంటివి నచ్చవనుకున్నా...

      Delete
  7. Replies
    1. ధన్యవాదాలు రమేష్ గారు..

      Delete
  8. Nice background song and poem also

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...