సర్లే ఈ రాత్రికి యింక ఏమీ రాయలేవు
కాసిన్ని అక్షరాలు నీ నుండి దూరమయి
మసక వెన్నెల కమ్ముకుని
ఏదో చీకట్లో బర బరా గీకేసి పోకపోతే నష్టమేముంది??
రాయాలన్న కాంక్షో మోహమో నిన్ను వీడక
ఏదో తాపత్రయమెందుకు
నువ్ రాయకపోతే భూమేమైనా తూర్పు నుండి పడమర తిరుగుద్దా??
వదిలేయిరా ఈ కాలాన్నింక నీ ఆగిన వాచీ ముళ్ళ మద్య
కాసింత నలుపు చేయక తెల్లగా మెరవనీయ్ ఈ కాగితాన్ని
కసిగా నువ్ నలిపి వుండ చుట్టి పారేసిన పదాలేవో
రేపు మెరవక మానవు మరొక సారి!!
రాయలేను రాదు రాదంటూనే రంజింపజేస్తారు
ReplyDeleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారు..
Delete" వదిలేయిరా ఈ కాలాన్నింక నీ ఆగిన వాచీ ముళ్ళ మద్య
ReplyDeleteకాసింత నలుపు చేయక తెల్లగా మెరవనీయ్ ఈ కాగితాన్ని "
- అని అన్నారే గాని అద్భుతంగా రాసారు కదా వర్మగారూ.
" ఖాళీ కాగితం... " ఎలా అవుద్ది ?
భావనలతో నిండిన,
నిండైన నలుపును పులుముకున్న
తెల్ల కాగితం అయి ....
మన్ననలందుకుంది కదా మీ కాగితం .
అభినందనలు వర్మ గారూ
* శ్రీపాద
ధన్యవాదాలు శ్రీపాద సార్..
Deleteరాయలేని నిస్సహాయతని నిండైన అక్షరాల్లో అల్లారు.
ReplyDeleteథాంక్యూ అనికేత్ చాన్నాళ్ళకి..
Delete"కసిగా నువ్ నలిపి వుండ చుట్టి పారేసిన పదాలేవో
ReplyDeleteరేపు మెరవక మానవు మరొక సారి!!"
ఇలానే ఎన్నోసార్లనుకున్నా...
ప్రతీ అక్షరం జాలిగా చూస్తూ మూలన చేరితే
మరిచిపోయిన భావాలన్నీ కుండపోతై
అక్షరాలు వెతుకుతూ ఎద చెలమలో దాగిపోతే
అప్పుడు అప్పుడు... నిశానీనై నీడల నిశీధి దా(త్రా) గుతూ.....
వెతుకుతూనే ఉన్నా....
చాలా రోజులకు మీ దర్శనం బ్లాగులో.. మీరిలా ఖాళీలను పూరిస్తూ వ్రాయడం చాలా బాగుంటుంది.
Deleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు పద్మాశ్రీరాం గారు..