Wednesday, May 14, 2014

అలసినతనం,,,

నల్లగా యింత మట్టి మొఖం మీద ఏవో స్పష్టాస్పష్ట ముడుతలను కప్పుకుంటూ

రేఖా మాత్రంగా మిగిలిన చారికలేవో ఉప్పుపేలి తెల్లగా

ఊపిరాడనీయని ఉక్కపోతతో దేహమంతా అలసినతనమేదో కమ్మి ఒకింత విశ్రాంతిని కోరుతూ

నువ్వంటావు కాసిన్ని నీళ్ళు ఒంపుకోరాదూ అని

నాకేమో ఆ ఎండిన ఆకుపై చినుకు పడితే చూడాలని వుంది

కాలమిలా బందిఖానాలో మగ్గి విరిగిన పాళీ అతికితే బాగుణ్ణు కదా అని వేచి చూస్తున్నా

రాదంటావా మరలా ఈ క్షణం..

పోనీ కోల్పోయినవన్నీ ఈ సమాధి రాళ్ళ మధ్యలో మొలిచిన గడ్డి పరకలలా మొలకెత్తుతూనే వున్నాయి కదా!

5 comments:

  1. " కాలమిలా బందిఖానాలో మగ్గి విరిగిన పాళీ అతికితే బాగుణ్ణు కదా అని వేచి చూస్తున్నా - "

    ..... అంటూ చాలా గాభీరంగా కదలింది మీ కవిత.
    మీ కవితల్లో చాలా వరకు వేదనలో ఏదో వెతుకుతున్న
    తపనను చూడగలుగు తున్నా నేను .
    ఇలాటి కవితలు రాయడం కాస్తా కష్ట తరమే అనిపిస్తుంది నాకు .
    కవిత బావుందండీ వర్మ గారూ .

    *శ్రీపాద

    ReplyDelete
  2. అలుపెరుగని బాటసారి మీరు....పయనించండి

    ReplyDelete
    Replies
    1. అంతేనంటావా అనికేత్.. ఎంతకాలమో ఇంక.. ప్చ్..థాంక్యూ..

      Delete
  3. కార్చీ కార్చీ కన్నీళ్ళు ఇంకిపోయాయి
    ఉక్కపోస్తుందే కాని చెమటకి కూడా నీళ్ళు కరువయ్యాయి....
    అయినా ఇంకా నీళ్ళు ఊటా అంటే ఎలాగండి?

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...