Wednesday, June 11, 2014

వెన్నెల జెండా..

నగ్న పాదాలతో ఈ రాదారిలో నిలుచున్నా

ఒంటరిగా ఖాళీ చేతులనిండా యింత ఓరిమితో


ఈ ప్రవాహ ఉరవడి ఎరుకతో నిశ్శబ్దంగా 

ఎండ కాలమంతాన వాన రాకడ కోసం ఎదురు చూస్తూ


వాన కాలమంతాన చలిగాలికి ఎదురు నిలుస్తూ


రాలే తురాయి పూలను మోదుగు పూలను దోసిట పట్టి 


పారే సెలయేటి గలగలలను గుండెలో దాచుకొని 


ఈ సరిహద్దు గిరి శిఖరాన వెన్నెల జెండా చేత పట్టి..



వస్తావా నేస్తం
నీ నవ్వునింత భరోసాగా ఇస్తావా?

4 comments:

  1. చాలా బాగుంది సర్. చాన్నాళ్ళకి మీ పంజా విసిరారు

    ReplyDelete
  2. " ఎండ కాలమంతాన వాన రాకడ కోసం ఎదురు చూస్తూ
    వాన కాలమంతాన చలిగాలికి ఎదురు నిలుస్తూ " .....

    ఎదురు చూపుల్లో
    అందముంది
    అర్ధముంది
    ఆదర్శమూ ఉంది.

    నేస్తంకై మీ ఎదురుతెన్నుల
    తీరు బావుంది.
    బాగా రాశారు.

    అభినందనలు వర్మ గారు.
    *శ్రీపాద

    ReplyDelete
  3. వెన్నెల దారిలో వెన్నెల జెండా ...బాగుంది సార్..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...