సరిగ్గా ఇక్కడే నువ్వొదిలి వెళ్ళిన చోటే
నీటి తడి ఇగిరి ఓ పాదం ద్విపద ముద్రగా ఇంకింది...
నువ్ నాటి వెళ్ళిన చోటే ఓ మొగలి రేకు
విచ్చుకొని నెత్తురు చీరుకుంది
నువ్వలా పాట ఆపి వెళ్ళిన నాడే
ఈ వెదురు గొంతు మూగబోయింది
నువ్ విసిరేసి పోయిన నవ్వు
అదిగో మబ్బు తునకలో దాగుంది
వెన్నెలనావరించిన నల్ల చందమామలా..
నువ్ విసిరేసి పోయిన నవ్వు
ReplyDeleteఅదిగో మబ్బు తునకలో దాగుంది
Thank you Viswamji...
Delete
ReplyDelete" నువ్వలా పాట ఆపి వెళ్ళిన నాడే
ఈ వెదురు గొంతు మూగబోయింది "
బావుందండీ మూగ బాధ.
కవిత నీట్ గా కుదిరింది.
అభినందనలు మీకు వర్మ గారూ .
*శ్రీపాద
Thank you Sreepaada Sir... _/\_
Delete