రాతి బింబం..
రాతిపై ప్రతిఫలిస్తున్న నీడ నీటిలో
నీ రాతి బింబం
రాతి పలకల మద్హ్య యింత చెలమ
చెలిమి చేసి దాహమవుతోంది
రెండు దోసిళ్ళ మధ్య మిగలని
నీటి బొట్టు నీ పెదవి చివర
ఒకింత ఎండ పొడతో కాంతినింత
సంతరించుకొని ప్రతిఫలిస్తూ
పగలని రాతి పొరల మధ్య
గుండె బెక బెకలు
ఈ చలి రాతిరి రాతి గుహలో
రెండు రాతి బింబాలు నిశ్చలంగా
ReplyDeleteమీ రాతి బింబం బాగుంది వర్మ గారూ .
అది ఫలమైనా , పక్షైనా , పూవైనా లేక
రాయైనా ...... కవితకేది కాదనర్హం అన్నట్లు .....
రాతిని నాతిగా చేసి చెక్కిన మీ
'రాతి బింబం' ఓ మంచి రూపునే
దిద్దుకుంది .. అయితే......
"ఈ చలి రాతిరి రాతి గుహలో
రెండు రాతి బింబాలు నిశ్చలంగా "
తో కవితను ముగించారు .
కవితను మరి కాస్తా పొడిగిస్తే .....
రాయి కాస్తా 'శిల్ప' మయేదేమో !!
అన్యధాభావించకండి - నేను కవిని కాను
అంతగా విశ్లేషించడానికి.
*శ్రీపాద
మీ సూచన బాగుంది సార్. కానీ అంతవరకే పలికింది మరి :-)
ReplyDeleteమీ ఆత్మీయ వాక్కు నాకెప్పుడూ స్ఫూర్తిదాయకం. ధన్యవాదాలు శ్రీపాద సార్..
అంత రాతిమనసా :-)
ReplyDeleteమరేమో అంత కాదు.. :-) ధన్యవాదాలు తెలుగమ్మాయి గారు..
Deleteరాతి పలకల మద్హ్య యింత చెలమ
ReplyDeleteచెలిమి చేసి దాహమవుతోంది...భావాత్మకం
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ప్రేరణ గారు..
Deleteమంచి కవితను అందించిన మీకు అభినందనలు.
ReplyDeleteThank you Harinath Maddi garu..
Deleteచలిరాతిలో రాతిబింబాలు వణకవని అలాగే వదిలేస్తే ఎలాగండి వర్మగారు. కాస్త రాతిని కరిగించే ప్రయత్నం చేయండి :-)
ReplyDeleteమీరు చెప్పాక కరగదా? :-)
Deleteమీ ఆత్మీయ స్పందనకు థాంక్యూ పద్మార్పిత గారు