రాత్రుళ్ళను కొన్ని పోగులుగా మన ముందు కుప్పబోసుకుంటాం అప్పుడప్పుడూ
ఎంత చిలికినా తరగని మౌన గానాలతో అనంతంగా అలజడులమధ్య
అప్పుడప్పుడూ మబ్బుల మధ్య వచ్చీ పోయే వెన్నెలనింత ఇసుక పోగులలో కూర్చుకుంటూ తడిగా
నవ్వులను ఏడ్పులను కలగలిపి ఇంత నెత్తుటి ముద్దగా చేసి ఇరువైపులా కనురెప్పలను అతికించి
ఆరని ఉద్వేగాగ్ని ఊపిరుల మధ్య ఉసుళ్ళను ఎగదోస్తూ
రాలిపడే మంచు తునకలు కరిగి ఉప్పు నీళ్ళ చాళ్ళుగా తెల్లగా స్ఫటికంలా మెరుస్తూ మిణుగురుల రెక్కల మధ్య
ఒక్కోసారి వాక్యమేదో విరిగి పడ్డ శబ్దావరణం కలలను మింగుతూ అస్పష్టంగా అవరోహణా క్రమంలో నీ చుట్టూ వలయంగా రాత్రి
.........
సెలవింక
......
ReplyDelete" ఎంత చిలికినా తరగని మౌన గానాలతో
అనంతంగా అలజడులమధ్యఅప్పుడప్పుడూ
మబ్బుల మధ్య వచ్చీ పోయే వెన్నెలనింత
ఇసుక పోగులలో కూర్చుకుంటూ తడిగా.... "
మీ ' రాత్రి ' లో బాగా మెచ్చిన, అందరికీ నచ్చే పలుకులివి.
బాగుంది వర్మ గారూ మీ "రాత్రి " .
*శ్రీపాద