Monday, December 23, 2013

ఆకులు రాలిన శిఖరం...



కొన్ని సార్లు ఆకులు రాలిన
చెట్లను చూస్తూ వుండి పోవాలనిపిస్తుంది

వర్షించని మేఘాలు తరలి పోతుంటే
రెప్పవేయకుండా ఆర్తిగా చూస్తూన్నట్టు

ఎక్కడో దాగిన వేరు నీరును తోడుతున్నట్టు
లోలోపల నెత్తురు చిమ్ముతూ

పడుతున్న వేటును పరాకుగా తప్పుకున్నట్టు
చేతులు అలా వడిసిపడ్తూ

గొంతు పెగలని రాగమేదో ఆలపిస్తున్నట్టు
చుట్టూ నిశ్శబ్ద సంగీతమావరిస్తూ

అక్షరమొక్కటే తలెత్తుకు నిలబడినట్టు
ఆ శిఖరం ఆకాశాన్ని తాకుతూ చిగురిస్తున్నట్టు!

2 comments:

  1. అక్షరమొక్కటే తలెత్తుకు నిలబడినట్టు
    ఆ శిఖరం ఆకాశాన్ని తాకుతూ చిగురిస్తున్నట్టు!
    వావ్....ఎంతటి ఆశాభావం...చాలా చాలా నచ్చేసిందండి.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...