Saturday, November 2, 2013

దుఃఖ దీపం..

 
నీ చుట్టూ కొన్ని ప్రమిదలు వెలుగుతు
గాలి నిన్ను కూచోనివ్వదు

నీ అరచేతులు చాలనప్పుడు లోలోన
దిగాలు ఒక్కసారిగా అసహనంగా

ఈ ప్రమిదలలోని నూనె ఒలకనీయక
దీపపు నీడ దాపెట్టే విఫలయత్నం

నీ చుట్టూ ఇన్నిన్ని క్రీనీడల సయ్యాటల
భయ దృశ్యం అల్లుకుంటూ

నీ చుట్టూ ఓ దీప తీరం వలయంలా
అల్లుకుంటూ అచేతనంగా

ఈ కాంతి రేఖల రాక పోకల
వ్యవధి మధ్యలో ఎన్ని మిణుగురుల ఆశలు

చిక్కనవుతున్న చీకటి పాట
గాలి అలలనలా కోస్తూ

అచేతనంగా అభావమౌతున్న
రూపం ధూప కలికమవుతూ

నీ ఒక్కడివే ఈ గదిలో
ఒంటరిగా ప్రమిదలో దు:ఖ దీపమౌతూ…

6 comments:

  1. Extraordinary!! Ur writings r amazing...

    ReplyDelete
  2. Matallev... Intha manchi kavitha chadivina tharvaatha matalela vastaayi cheppandi:-):-)

    ReplyDelete
  3. ఈ ప్రమిదలలోని నూనె ఒలకనీయక
    దీపపు నీడ దాపెట్టే విఫలయత్నం

    నీ చుట్టూ ఇన్నిన్ని క్రీనీడల సయ్యాటల
    భయ దృశ్యం అల్లుకుంటూ...wonderful

    ReplyDelete
  4. అందరికీ వందనాలు _/\_
    హృదయపూర్వక ధన్యవాదాలు...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...