Thursday, July 4, 2013

భారమితి..

 
మనసులో ఒలికినది
చేతులలోకి చేరదు...

కనులలో తొణికినది
ఎదలో నిలవదు...

కాగితంపై చిందినది
నెత్తుటి జీర...

గొంతులో మూగైనది
తడి రాగం...

వేలి చివరే మిగిలినది
కుంచెకంటని రంగు...

భారమితికి అందనిది
భావ ప్రకంపన...

8 comments:

  1. ఏమిటో ఇంతా విషాదాన్ని పదాల్లో చదవడమే కష్టంగా ఉంది.....నిత్యజీవితంలో కష్టమేనేమో!

    ReplyDelete
    Replies
    1. జీవితమంటేనే వెలుగు నీడల క్రీనీడ కదా తెలుగమ్మాయి గారూ.. తప్పదు..:-)

      Delete
  2. మీ భావప్రకంపనలు ఎప్పుడూ వ్యధాభరితమే :-)

    ReplyDelete
    Replies
    1. అది దాటే వంతెనకు అల్లంత దూరంలో మిగిలి పోవడమే కారణం కదా పద్మార్పిత గారూ..
      థాంక్యూ

      Delete
  3. అద్భుతం 'కవివర్మ 'గారూ.మీ భావ ప్రకంపనలు మదిని తాకి, వ్యధను తీరుస్తాయని ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండీ అనూ గారు. I'm just Varma Madam..

      Delete
  4. వావ్...భావప్రకంపనలతో మనసును తాకుతారు

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి ధన్యవాదాలు అనికేత్..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...