Sunday, June 30, 2013

దేహ కుంపటి..


మబ్బు కుండ పగిలి
జోరున వాన కురుస్తూ...

కనులలో ఉబికిన నీరు
చినుకులో కలగలిసిపోతూ...

పగిలిన నేల గుండెలో
పడి ఆవిరవుతూ...

కంటి అద్దం ముందు
అబద్ధమౌతూన్న నిస్సహాయతతో...

కొలిమంటుకున్న దేహ కుంపట్లో
తడి ఆరని మేఘం...

7 comments:

  1. ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం ఎంటరై చలికాలం త్వరలో రాబోతుందండి.....ఎప్పుడూ ఇలా మంటలేనా కాసిన్ని చల్లని పదాలు పలికించండి మీ కలం నుండి :-)

    ReplyDelete
    Replies
    1. మంట వెనక దాగిన చల్లదనం మీకు తెలియనిదా పద్మార్పిత గారు..:-)
      మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు

      Delete
  2. మీ ' దేహకుంపటి మనసుని వణికించింది'...

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు అనూ గారు..

      Delete
  3. చాలా చాలా బాగుందండి.

    ReplyDelete
  4. ఎంత నిస్సహాయతను చూపించారండి.

    ReplyDelete
  5. Thank you ప్రేరణ గారు జయ గారు

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...