Friday, June 21, 2013

నిప్పు హృదయం..

నిన్నంత సున్నితంగా
ఈరోజు లేవు

మౌనం ఓ రంపంలా
తరుగుతూంది

కదలని కాలం
కాళ్ళ కింద పందిర్రాటలా

నిశ్చలమైన విన్యాసం
తాడు మీద నడక

రెప్పలపై రాలుతున్న
ఇసుక క్షణాలు

దోసిలి నిండా నిలవని
వాన బొట్లు

కాలుతూన్న
నిప్పు హృదయం

8 comments:

  1. చాన్నాళ్ళకి ఇలా.....ఇంతకీ నిప్పులా కాలుతున్నది మీరా మీ కలలయామినియా వర్మగారు :-)

    ReplyDelete
    Replies
    1. ఇరువురి మధ్యా నివురులా కమ్ముకున్న మౌనపు ధూళి పద్మార్పిత గారు..
      మీ ఆత్మీయ చిరునగవుకు ధన్యవాదాలు..

      Delete
  2. చాలా మంచిఫీల్ తో వ్రాసినట్లున్నరు వర్మగారు...బాగుందండి!

    ReplyDelete
    Replies
    1. థాంక్సండీ ప్రేరణ గారూ.. చాలా రోజులకు ఇలా మీ రాక..

      Delete
  3. Great comparisons...relating HER.

    ReplyDelete
  4. ఇదేదో....ఇరువురినడుమా సక్యతలోపించిన కవితలా ఉందండి:)

    ReplyDelete
    Replies
    1. సఖ్యత లోపించడం కాదు.. కాస్తా దూరమైన భావభారం అనికేత్..:-)

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...