చేతిలో లాంతరు మసకబారుతూ
కనుల ముందు చీకటి తెరలు తెరలుగా...
వీధి మలుపులో తెల్ల తెల్లగా దూది ముద్దలులా
నంది వర్థనం పూలు తడిగా...
విసురుగా వీచిన గాలికి అవిసె చెట్టు
కొమ్మలనుండి వాన నీరు కుమ్మరింపు...
దూరాన గాయపడ్డ రాగమేదో
దు:ఖానలాన్ని సన్నగా మండిస్తూ...
కొండ పోడులో రాజుకుంటున్న
నిప్పు పొగ కమ్ముకుంటూ...
అవ్వ చేతిలో ఎర్రటి అంబలి
గిన్నెలో వణుకుతూ...
కాలం దేహపు నడి రోడ్డుపై
నెత్తురు కక్కుకుంటూ...
njaani ki daggaragaa aadramgaa chaalaa baavundi
ReplyDeleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు మంజు (చెప్పాలంటే) గారు.
Delete"కాలాన్ని" "దృశ్యం"గా మీ కవితలో మా ముందుంచారు.
ReplyDeleteమీ అభిమాన సహస్పందనకు ధన్యవాదాలు అనూ గారు..
Deleteనిజాలన్నీ ఇలా చీకటిలో కనబడని అందీ అందని అందాలేమో.....మీ కవిత చాలా బాగుందండి.
ReplyDeleteఅవుననుకుంటా సృజన గారూ..:-)
Deleteఎన్నాళ్ళకి మీ రాక.. ధన్యవాదాలు..
ఏంటో జీవితంలోని సత్యకోణాలు ఇలా భాధాతర్పంగా ఉంటాయి.:(
ReplyDeleteనిజమే కదా అనికేత్..
Deleteనా రాతల పట్ల మీ అభిమానానికి ధన్యవాదాలు..
జీవిత సత్యాలకి మీ భావాన్ని జోడించి భలే చెప్పారు.
ReplyDeleteThank you తెలుగమ్మాయి గారు..
Deleteexcellent sir
ReplyDeleteThank you skvramesh garu..
Delete