Monday, June 3, 2013

తరగని దూరం...

నీ మౌనాన్ని గుండెలో ఒంపుకొని
పాట కట్టలేని నిస్సహాయత...

గుమ్మం దాటుతూ నీ రెప్పమూయని కంటిపాప
వెనక దాగిన చిత్రం దాచుకుంటూ...

తడి ఆరని చెక్కిలిపై సన్నగా తాకిన సమీరం
దిగులుగా మరలి పోతూ...

తాకీ తాకని అరచేతుల మద్య ప్రవహించి 
ఒదిగిపోయిన పలకరింపు...

వెళ్ళొస్తానని వాగ్ధానమీయ లేని అసహాయత
నన్ను నేలలోకి కుంగదీస్తూ...

చెరో దారం కలుపుతూ ఎగరేసిన గాలిపటం
ఎక్కడో చిక్కుముడి పడుతూ...

తరగని దూరాల మద్య తీరం దాటని
నావలో పయనిస్తూ...

19 comments:

  1. బాగుందండి మీదైన పంధాలో సాగింది కవిత మొత్తం.

    ReplyDelete
  2. కాడి ,మేడి వ్యవసాయానికి కావాలి .కవితా వ్యవసాయానికి భావాల వేడి ఆవేశాల మేడి తప్పనివి అవి మీ స్వంతం.

    ReplyDelete
    Replies
    1. ఎన్నాళ్ళకి మీ రాక.. ధన్యవాదాలు గురూజీ..

      Delete
  3. సో క్యూట్...బట్ మీ భావుకతలో ఇంత విషాదాన్ని అంగీకరించలేని నా మది అక్షరమిలా సం’భాషిస్తోంది సర్ కవి వర్మాజీ...

    ఇంత దిగులేలని పలకరించే
    నా చెలిమిని పరిహసిస్తూ సాగుతున్న సమీరాలు

    మళ్ళెప్పుడొస్తావో అనే దిగుల చూపుల
    మాటున దాగిన చెప్పలేక చెప్తున్న వీడ్కోలు రాగాలు

    అంతు తెలియని ఈ గుప్పెడు గుండెలో
    దాగలేని అనురాగలతల చెలిమి మేఘాలు

    ఇన్నిటి మధ్యన అందంగా నవ్వుతున్న
    పెదవుల ను స్నానిస్తూ ఫక్కుమంటున్న విషాదపు చెలమలు

    ReplyDelete
    Replies
    1. వీడని దిగులు వెంటాడుతూ వస్తుంది కదా అక్షరాల మాటున.

      మీ ఆత్మీయ కవితా సంభాషణతో విషాదపు చెలమలలో నవ్వుల కలువలు వికసింప చేసినందుకు వేన వేల వందనాలు పద్మాశ్రీరాంజీ..

      Delete
  4. raadantune chakkani kavita lolotaina bhaavaanni palikincharu mi saili lo

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మంజుల (చెప్పాలంటే) గారు..

      Delete
  5. భావుకత్వం మెండుగా నిండిన కవితండి. చాలాబాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీరిలా అంటే చాలా ఆనందమండీ.. థాంక్యూ..

      Delete
  6. విషాదంగా ఆలోచనలతో చిక్కు ముళ్ళని విప్పే ప్రయత్నమేదీ చేయకుండా నిరాశ నిస్పృహలతో నీరుగారిపోతే ఎలాగండి :-)(just kidding Varmagaru....to be frank beautiful feel)

    ReplyDelete
    Replies
    1. అవునండీ మీరన్నది నిజమే కానీ ఎద ఇలా జవాబిస్తే నిస్సహాయుణ్ణే కదా పద్మార్పిత గారూ.. థాంక్సండీ...

      Delete
  7. mee bhaavaavesam taraganeekandi

    ReplyDelete
  8. మనిషి మాత్రమే దూరం మీరు మీ కవితలతో మాకే దగ్గరైనప్పుడు...తనకింకెంతదగ్గరగా ఉన్నారో ఊహించగలంలెండి.:)

    ReplyDelete
    Replies
    1. అవునా.. అయితే ఓకే..:-)
      Thank you అనికేత్..:)

      Delete
  9. వర్మగారూ....దూరం తరగదని పెంచుకుంటూ పోకండి.:)
    ఈ మధ్యా మీ కవితావేశం తగ్గి చాలా టైం గాప్ ఇచ్చి రాస్తున్నారు ఎందుకో?

    ReplyDelete
  10. మీ మాట పాటిస్తాను మేడం..
    మీ రాక కరవై.. :-)

    ReplyDelete
  11. ippude chadivaanu.... Supero super.. vijil veyaalani try chestunna ikkada....:-):-) kavithaa rajyanni mee kalamtho shasistunnaaru.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...