Tuesday, March 5, 2013

నెత్తురోడుతూ...


ఇప్పుడేమి రాసినా తడిమినా
వేడి నెత్తురంటుతూనే వుంది...

అప్పుడే చాయ్ తాగి
హుష్ అంటూ భుజంపై వాలిన కాకిని
తోలుకుంటూ నడుస్తున్నా...

ఎవరిదో భుజంపై అరచేయి
తడుతూ బాగున్నావా అని పలకరిస్తూ
ఇంత నెత్తురు ముద్దను పులుముతూ...

ఇంటి ముందర కాళ్ళు రెండూ
తెగిపడిన పిల్లాడి చుట్టూ జనం
కనుగుడ్లలో నెత్తురు చిమ్ముతూ...

సైకిల్ టైరు చుట్టూ మేకులు దిగబడి
గాలి లేక వంకర్లు పోతున్నా తోలుకుంటూ
జారిపోతున్న పైజామా ఎగదోస్తూ
ఓ కుర్రాడు పరిగెత్తుకొస్తూ...

ఇవేవీ పట్టని ఆ అవ్వ ఇన్ని గులాబీ పూలు
బుట్టలో వేసుకొని వీధి వెంట మౌనంగా నడుస్తూ...

రాతిరి కాస్తున్న నెలవంక ముఖంపై
నెత్తుటి గాయం అలా పచ్చిగానే వేలాడుతూ....

2 comments:

  1. నిర్మొహమాటంగా చెప్పాలంటే...నాకు కూసింత కష్టమే ఇది అర్థం కావడం;-(

    ReplyDelete
    Replies
    1. మీరలా అనడంలోనే మీకు అర్థమవుతోందని తెలుస్తోంది పద్మార్పిత గారూ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...