Thursday, February 21, 2013

వెన్నెల కాపలా...

నువు నన్ను
నచ్చలేదన్న
ప్రతి సారీ
నీ 
కనులలో దాగిన
నా రూపం 
వెక్కిరిస్తూంది...

నీవు విసురుగా
మెడ తిప్పి 
పో
అని కసురుకున్న
ప్రతి సారీ
నీటి పాయలా
నీవు మరల
దరి చేరుతావని
ఆశగా...

నీ 
తిరస్కారం 
వెనక
దాగి వున్న
 ప్రేమ
అలలా 
మరల మరలా
స్వచ్చంగా
నా గుండెను
తాకుతూనే 
వుంటుంది..

నీ 
చిర్నవ్వంటిన
వెన్నెల 
రేయంతా
రెప్పలపై 
కాపలాగా...

4 comments:

 1. మీరిలా అంటే అలా వెన్నెల్లో కరిపోతుందేమో మీ కలలయామిని....ఎంత అల్పసంతోషండి :-)

  ReplyDelete
  Replies
  1. నిజమేనా పద్మార్పిత గారూ :-)

   మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండీ..

   Delete
 2. super pic daniki tagga padajaalam mee kavitalo

  ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...