అలుపు తీర్చుకుందామని
ఈ మలుపు దగ్గర ఆగాను...
ఈ గడ్డి పరక ఒకటి మెత్తగా తాకుతూ
నిటారుగా నిలబడుతూ వుంది పచ్చగా...
ఒరిపిడి తాకిడికి ఈ రాతి గుండె
సున్నితత్వాన్ని పొందినట్టుంది....
ఈ ఇసుక పర్రల మధ్య మెరుస్తున్న
రేణువుల బంగరు చాయ...
అలల మధ్య ఖాళీ వలయాల గుండా
నీటి పాయల సుళ్ళు...
ఒక్కోటీ దేనికదే ప్రత్యేకంగాను
కలగలసిన ఏకత్వాన్ని పొందుతూ...
ఆగని ప్రవాహం మరల మరల
సాగుతూ నిరంతర యానం...
Ee bhava sangharshana antharmukheenangaa undi. Saamaajikamai bahirgathamaithe baagundu.
ReplyDeleteసద్గుణ సమాజం గారూ అంతర్ముఖంగా కలిగిన భావమే కదా సామాజీకరింపబడుతుంది. ఇందులో అంతర్లీనంగా చెప్పిన విషయమదే కదా సార్.. మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteకవిత బాగుందండి.
ReplyDeleteanrd గారూ ధన్యవాదాలండీ...
Deleteచాన్నాళ్ళకి పదాలని పలికించారు...
ReplyDeleteప్రవాహాన్ని పరవళ్ళుత్రొక్కుతూ సాగనీయండి!
తప్పకుండా పద్మార్పిత గారూ..
Deleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ...
మీ అందమైన భావప్రవాహంలో మమ్మల్ని తడవనీయండి:)
ReplyDeleteఅంతకంటే మంచి అవకాశం నా భావాలకుంటుందా అనికేత్...
Deleteమీ అభిమానానికి సదా కృతజ్నున్ని...
మీ పచ్చదనాల పదవిన్యాసానికి చిత్రం చక్కగా కుదిరింది. అభినందనలు
ReplyDeleteమీ అభినందనలు పొందడం నా అదృష్టమండీ ప్రేరణ గారు..
Deleteధన్యవాదాలు...
మీ కవీతా ప్రవాహం మధ్యలో ఆగి మొదలైనట్లుంది....సాగనివ్వండి :-)
ReplyDeleteఆగి మరల కొత్తగా మొదలవుదామని... మీ అభిమానానికి ధన్యవాదాలు తెలుగమ్మాయిగారూ...
ReplyDeleteఒరిపిడి తాకిడికి ఈ రాతి గుండె
ReplyDeleteసున్నితత్వాన్ని పొందినట్టుంది....చాల బాగుంది సర్ జి
Thank you Seleneji..
Delete
ReplyDeleteఈ గడ్డి పరక ఒకటి మెత్తగా తాకుతూ
నిటారుగా నిలబడుతూ వుంది పచ్చగా...
ఒరిపిడి తాకిడికి ఈ రాతి గుండె
సున్నితత్వాన్ని పొందినట్టుంది....
బాగుంది సార్ మీ కవితా ప్రవాహ వెల్లువ
dhanyavaadaalu najeevan gaaru..
Delete