మనసంతా తెల్లకాగితంలా
ఏదీ అంటనితనంతో దిగాలుగా...
అక్షరం అతకనితనంతో
వాక్యం పొందు కుదరక ఆర్తిగా...
రంగు పూయనితనంతో
గీతల మధ్య పొసగక ఖాళీగా...
మంచు కరగనితనంతో
గుండె బరువు గొంతులో మూగగా...
అసంపూర్ణ రాగం ఒక్కో మెట్టు
పలకనితనంతో మౌనంగా....
ఆవరణంతా అలముకున్న
కారు మేఘం కురవక ఉక్కపోత...
ఈ నిశ్శబ్ధ సంధిగ్ధావరణంలో
నీ పిలుపు ఆనందార్ణవమై మెరవగా...
రాజుకున్న నిప్పు సెగలు
ఈ రేయినింక తెలవారనీయవు...
ఏదీ అంటనితనంతో దిగాలుగా...
అక్షరం అతకనితనంతో
వాక్యం పొందు కుదరక ఆర్తిగా...
రంగు పూయనితనంతో
గీతల మధ్య పొసగక ఖాళీగా...
మంచు కరగనితనంతో
గుండె బరువు గొంతులో మూగగా...
అసంపూర్ణ రాగం ఒక్కో మెట్టు
పలకనితనంతో మౌనంగా....
ఆవరణంతా అలముకున్న
కారు మేఘం కురవక ఉక్కపోత...
ఈ నిశ్శబ్ధ సంధిగ్ధావరణంలో
నీ పిలుపు ఆనందార్ణవమై మెరవగా...
రాజుకున్న నిప్పు సెగలు
ఈ రేయినింక తెలవారనీయవు...
నిర్మొహమాటంగానే...చాలా బాగుందండి.
ReplyDeleteజయ గారూ ధన్యవాదాలండీ...
Deleteఆ పిలుపుకి అంత పవర్ ఉందా....అంతా మటుమాయం :)
ReplyDeleteఉందని నీకూ తెలుసు కదా అనికేత్..:-)
Deletethank you..