Wednesday, February 13, 2013

తెల్లకాగితం


మనసంతా తెల్లకాగితంలా
ఏదీ అంటనితనంతో దిగాలుగా...

అక్షరం అతకనితనంతో
వాక్యం పొందు కుదరక ఆర్తిగా...

రంగు పూయనితనంతో
గీతల మధ్య పొసగక ఖాళీగా...

మంచు కరగనితనంతో
గుండె బరువు గొంతులో మూగగా...

అసంపూర్ణ రాగం ఒక్కో మెట్టు
పలకనితనంతో మౌనంగా....

ఆవరణంతా అలముకున్న
కారు మేఘం కురవక ఉక్కపోత...

ఈ నిశ్శబ్ధ సంధిగ్ధావరణంలో
నీ పిలుపు ఆనందార్ణవమై మెరవగా...

రాజుకున్న నిప్పు సెగలు
ఈ రేయినింక తెలవారనీయవు...


4 comments:

  1. నిర్మొహమాటంగానే...చాలా బాగుందండి.

    ReplyDelete
  2. ఆ పిలుపుకి అంత పవర్ ఉందా....అంతా మటుమాయం :)

    ReplyDelete
    Replies
    1. ఉందని నీకూ తెలుసు కదా అనికేత్..:-)
      thank you..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...