నడచిన దారెంట ఇన్ని రాలిన పూల గురుతులు
రాక మరచిన అతిథిలా...
దప్పిక తీరని గొంతులో ఇన్ని తేనె మాటలు
ఒంపిన క్షణాలు...
కాలం పరుగుపెడుతున్న ఈ దీపాల దీవిలో
నడక సాగుతూనే...
వెచ్చని తడి ఆరని సంధ్య మలుపులో
ఆకలి తీరని కళ్ళు...
ఒక్కడే దివిటీగా మండుతున్న హృదయంతో
విషాద గీతమాలపిస్తూ...
అగ్ని పూల చెండులో దారంగా మారుతు
భగ భగ మండుతూ...
ఆకాశంలో ఆ చిగురున ఓ మిణుగురు
ఎర్రగా అంతర్థానమవుతూ...
వర్మ గారు. బాగుందండి.
ReplyDeleteథాంక్సండీ జలతారువెన్నెల గారు...
Delete