Tuesday, March 12, 2013

లేలేతగా...

హృదయంపై బాసింపట్టు వేసిన
జ్నాపకాలు...

దేహమంతా ఇప్పపూల వాసనేస్తూ
మత్తుగా...

దాహం తీర్చని జీలుగు కల్లులా
గొంతు దిగుతూ...

చిగురు మామిడి లేలేత ఆకులా
చేతి కంటుతూ...

ఈ రాతి బాటలో అరి పాదం
మండుతూ...

6 comments:

 1. మీలో ఒక కృష్ణ శాస్త్రి ,తిలక్ వున్నారు వర్మగారు, మీ కలం నుంచి వచ్చే ప్రతి అక్షరం కూడా అందమైన అక్షరకన్నేలే.
  చాల బావుంది

  ReplyDelete
  Replies
  1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు పూర్వ ఫల్గుణి గారు...

   Delete
 2. ఓహ్!! ఎంత బాగా చెప్పారో!
  జ్ఞాపకాల గురించి ఇలా చెప్పటం మీకే చెల్లు వర్మ గారు...

  ReplyDelete
  Replies
  1. అంతా మీ కవితాత్మీయత జలతారు వెన్నెల గారు.. ధన్యవాదాలు...

   Delete
 3. చాలబావుంది వర్మగారు...

  ReplyDelete
  Replies
  1. మీకు నచ్చలేదని తెలుస్తోంది పద్మార్పిత గారూ.. నిజమేనా??

   Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...