Tuesday, March 5, 2013

నిశ్శబ్ధ రేఖ...


ఇలా తడి ఇసుక పై వేలితో రాస్తూ
ఎదురెదురుగా...

ఒంటరితనాన్ని అల ఒకటి
మింగి పాలనురుగును పాదాల కద్దింది...

ఇంతలో ఓ నత్త నెమ్మదిగా
చేరి నీ కాలి గోరును ముద్దాడుతూ...

ఒడ్డుకు చేరిన తెల్లని శంఖమొకటి
సాయంత్రపు నీరెండలో మెరుస్తూ...

గవ్వలేరుకుంటున్న చిన్నారి
మొఖంలో వెలుతురు నవ్వుతూ...

పల్లీలు ఒక్కోటీ నములుతూ
మౌనాన్ని మింగుతున్న...

బద్ధలు కాని నిశ్శబ్ధాన్ని
మన మధ్య గీసిన చిత్రకారుడెవ్వడో..

10 comments:

  1. బద్ధలు కాని నిశ్శబ్ధాన్ని
    మన మధ్య గీసిన చిత్రకారుడెవ్వడో.. haree haree wasundhara pe nila nila yeh gaganke jis pe badalo kee palakee uda raha pawan
    dishaye dekho rangbharee, chamak rahee umang bharee
    yeh kis ne phul phul pe kiya singar hai
    yeh kaun chitrakar hai(దేముడిని మించిన చిత్రకారుడు ఎవరండీ?

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పూర్వ ఫల్గుణి గారు..

      Delete
  2. నిశ్శబ్దాన్ని చిత్రకారుడు గీస్తేనేం.....ఆ చిత్రానికి మాటలు నేర్పే భావుకత్వం మీ సొత్తుకాదా!

    ReplyDelete
    Replies
    1. అంతా మీ ఆత్మీయత కదా.. థాంక్యూ పద్మార్పిత గారూ..

      Delete
  3. వర్మగారు...ఈ మౌనాన్ని చిత్రించిన చిత్రకారుడు మీరేనేమో, అందుకే బ్లాగ్ లో మరీ నల్లపూసైపోయారు :-)

    ReplyDelete
    Replies
    1. కరెంటు కోత పని వత్తిడి అలాగే అక్షరం పలకక పోవడం ఇలా బ్లాగుకు దూరమయ్యా సృజన గారూ.. మీ అభిమాన స్పందనతో స్ఫూర్తినిస్తున్నందుకు ధన్యవాదాలు..

      Delete
  4. పద్మార్పిత గారి మాటే నాది కూడా :)

    ReplyDelete
  5. avunu andari maate naa maata kudaanu...chakkani bhaavaanni alaokagaa likhinchaaru

    ReplyDelete
    Replies
    1. మీ కవితాత్మీయతకు ధన్యవాదాలు మంజు గారూ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...