Tuesday, August 4, 2009

స్తూపం మీది పేర్లు


వాటిని చదువుతుంటే
మీ రూపు కనులముందు కదలాడుతోంది
అవి మీ పేరులు మాత్రమేనా
వెయ్యేళ్ళ యుద్ధ నావను నడిపిన
సరంగుల ఆనవాళ్ళు!
జనం గుండెల్లో గూడు కట్టుకున్న
పోరాట రూపాలు!
ప్రవహించే ఉత్తేజపు అలల సవ్వడి
వినబడుతోంది
మా నరాలలో లావా ఉరకలెత్తుతోంది
మా దేహం సంధించిన బాణమవుతో౦ది

తెగిపడిన మీ క౦ఠనాళాలలో౦చి
కదంతొక్కుతూ పదంపాడుతూ
పదండి ముందుకు అంటూ సాగిన
విముక్తి గీతాలాపన హోరు...

పచ్చని పైరు మీదుగా వీచిన గాలి తిమ్మెర
ఏదో చల్లని కబురు చెవిలో
చెప్పిన అనుభూతి!
మీ నవ్వుల హరివిల్లులు నలుదిశలా
పరుచుకున్న ఆనందహేల!

కొన్ని విజయాలు మాత్రమేనా...
శతాబ్దాల బానిస సంకెళ్ళు తెగిపడిన
జయజయధ్వానాలు!

మీ పేర్లు స్తూపం మీదేనా?
కాదు జాతి విముక్తి పోరాట
చరిత్ర పుటల్లో నెత్తురంటిన
పేజీల నిండుగా!

మీ అమరత్వం రేపటి
సూర్యోదయానికి అరుణిమను
పూసింది...
(ప్రజలకోసం దేశ బానిస సంకెళ్ళను తెగ్గొట్టే పోరాటంలో అమరులైన ప్రజా యుద్ధ వీరుల స్మృతిలో)

8 comments:

  1. వర్మగారూ, మళ్లీ ఇలా కలుస్తున్నాం. కవిత చాలా బాగుంది. ఆ అమరత్వం రేపటి సూర్యోదయానికి అరుణిమను పూసినంత స్వచ్చంగా ఉంది. అబినందనలు.

    బావున్నారు కదూ.. నెట్‌లో కలిసి దాదాపు నెలరోజుల పైనే అయిందనుకుంటాను.

    చందమామ చరిత్రపై ఇటీవల నేను కొత్తగా తెరిచిన కింది బ్లాగును వీలయితే చూడండి.

    blaagu.com/chandamamalu

    రాజు

    ReplyDelete
  2. వెయ్యేళ్ళ యుద్ధ నావను నడిపిన
    సరంగుల ఆనవాళ్ళు!

    అద్బుతమైన మెటపర్. చాలాలోతుగా బలంగా ఉంది.

    అభినందనలు.

    చిన్న పరిశీలన అన్యధా భావించరనే ధైర్యంతోనే

    రెండవ పారాగ్రాఫులో ఎత్తుగడలో ఉన్నంత ఫోర్స్ కనిపించలేదు.

    మిగిలిన కవిత బాగుంది.

    కవితా వస్తువు పరిధి అలాంటిది మరి. కదూ

    బొల్లోజు బాబా

    ReplyDelete
  3. రాజశేఖర్ గారూ మరల కలిసినందుకు ధన్యవాదాలు.

    బాబాగారూ మీ విశ్లేషణకు నోచుకున్నందుకు ఆనందంగా వుంది. సరిదిద్దుకుంటాను. అమరుల ఙాపకాలు నన్ను తీవ్రమైన అలజడ్ ఇకి లోనుచేస్తాయి.

    ReplyDelete
  4. Chhalaa bavundi, forceful.
    please change the colours, it is difficult to read it.

    ReplyDelete
  5. Agnaatha gaaru mee soochanaku dhanyavaadaalu. maarhaanu.

    ReplyDelete
  6. మీరు చేసిన మార్పులను బట్టి నే చెప్పిన విషయాన్ని మీరెంత లోతుగా అర్ధం చేసుకొన్నారో స్ఫష్టమయింది. మీ మార్పులు బాగున్నాయి. కవితకు మరింత అందాన్నిచ్చాయి.

    మీరు కొత్తగా చేర్చిన కొన్ని ఉపమానాలవల్ల కవితమరింత లోతుబారింది. ఒక రకమైన భావతీవ్రత ప్రవహించింది.

    నే సూచించిందీ అదే. ఎత్తుగడలోని భావతీవ్రత సస్టైన్ అయితే బాగుంటుందని.

    మార్పుల వలన ఇప్పుడు ఆ టేక్ ఆఫ్ పెర్పెక్ట్ గా జరిగి, అంతే పెరఫెక్ట్ గా కవిత లాండ్ అయినట్లు తెలుస్తూంది.


    థాంక్యూ

    బొల్లోజు బాబా

    ReplyDelete
  7. "దేహం సంధించిన బాణమవుతో౦ది" ఏదో తెలియని ఉద్విగ్నత. బాబా గారి విశ్లేషణ ఎపుడూ కవితకి ఉన్నతిని కూరుస్తుంది. నిజంగానే మీ భాగ్యం ఆయన సమీక్ష. "హరివిల్లులు నలుదిశలా పరుచుకున్న ఆనందహేల" చదువుతుంటే "భారతీయుడు" సినిమాలో "..నట్ట నడి రాతిరిలో నవ్వు మొగ్గ పూసిందే" అంటూ సాగే పాట గుర్తుకొచ్చింది. మీ కవితా సంచలనం ఇలాగే సాగాలి ఇంకా ఇంకా ఉత్తేజాన్ని నింపాలి. మంచి కవితని చదివే భాగ్యమిచ్చారు. కృతజ్ఞతలు.

    ReplyDelete
  8. ఉషా మేడం.. మీ వ్యాఖ్యల తోడు వుంటే మనసున రగిలే అలజడిని మరింతగా వ్యక్తపరచగలననుకుంటా..
    Thank you once again..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...