అమ్మా అని నోరారా పిలిచేందుకు
నీవు ప్రయత్నిస్తున్నప్పుడే
మమ్మీ డాడీ అనమని నీ
చెవి మెలిపెట్టినందుకు
నన్ను క్షమించు కన్నా..
నీవు బుడిబుడి నడకలు నేర్చుతున్నప్పుడే
నీ వీపున బండెడు బరువుగల సంచి
తగిలించినందుకు
నన్ను క్షమించు కన్నా..
కాన్వెంటు కంచె వెనకాల నిన్ను
విడిచి వచ్చిన క్షణం నీ చూపుల వెనక
దాగి వున్న ఆర్తిని గుర్తించలేని
నా అంధత్వాన్ని
క్షమించు కన్నా...
ఎదిగీ ఎదగని నీ పాదాలను
నల్లబూట్లలో కుక్కి నీ నెమలి
కంఠానికి నల్లని టై బిగించి
విసురుగా నిన్ను రిక్షాలో కుక్కి
పంపిన క్షణం నీవు సాచిన చేయిని
అందుకోనందుకు క్షమించు కన్నా...
తొలిజాములో మెల మెల్లగా నా
గుండెలలో దాక్కుని నిదుర పోయేందుకు
దాగిన నిన్ను మిగిలిన హోం వర్కు
చేసేందుకు నెట్టినందుకు
క్షమించు కన్నా...
ఉత్సాహంతో ఉరకలు వేస్తూ హాయిగా
సాగాల్సిన నీ కౌమారాన్ని
జైలు కంటే ఘోరమైన కార్పొరేట్ కాలేజీ
సెల్ లో వేసి ప్రపంచం తెలియకుండా
చేసినందుకు నన్ను క్షమించు కన్నా...
చదువు చదువు తప్ప లోకం
తెలియని నీ కనుల వెనుక దాగిన
ఒంటరి కన్నీటి చుక్క
నా కోసం దాయమని
వేడుకుంటున్నా....
(ఈరోజు నా సాగర్ పుట్టిన రోజు. వాడికి నా కన్ఫెషన్ ఇలా..)
వర్మగారు
ReplyDeleteఎంత బాగారాశారు! సాగర్ మీ అబ్బాయా?
సరిగ్గా ఇదే నాగుండెల్లో వ్యధ కూడా.
కానీ మరెలా?
నా అబ్బాయి గురించీ నేనూ ఇలాగే అనుకుంటూ ఉంటాను. కానీ చుట్టూ ఉన్నవారికి భిన్నంగా వాడిని పెంచడమంటే వాడిని మరింత కష్టపెట్టడమేననిపిస్తోంది. రేపొద్దున అందరిలా నన్నెందుకు పెంచలేదని వాడు ప్రశ్నిస్తాడేమో తానొక్కడూ భిన్నంగా ఎవరితోనూ ఇమడలేక ఒంటరైపోతాడేమో నన్న భయాలు.
ఇప్పటికే నా కజిన్స్ అంతా మీ వాడినేంటీ అలా డిఫెరెంట్ గా పెంచుతున్నావ్ అంటారు కొన్ని విషయాల్లో. ఈ పరుగులు, పోటీలు, ఫార్మాలిటీస్ ఎంతవద్దనుకున్నా తప్పవేమో అనిపిస్తూ ఉంది.
happybirthday to u sagar. చాలా బాగు౦ది మీ కవితా.
ReplyDeleteచిన్నారులకి పదం పదం దగ్గరుండి పలికించి, మురిసే తల్లి తండ్రులు తీరా వాళ్ళు పదాలు చేర్చి ప్రశ్నలు అడిగే సరికి విసుక్కుని keep quiet అని వాళ్ళలోని జిజ్ఞాసని ఎలా తృంచివేస్తారో అన్న దానిపైన ఈ మధ్య ఒక వ్యాసం చదివాను. ఎందుకో just remembered it, nothing to do with what is in between you and sagr. Thank God I do not have to confess any of my upbringing. My kids are at the freedom the best I could give them. ;) And by god's grace they are excelling at School. Happy birthday to Sagar.
ReplyDeleteబాగుంది మీ కవిత.
ReplyDeleteరమ్య గారు సాగర్ మా అబ్బాయే, వాడిని నా ఊహలకణుగుణంగా పెంచుదామని ఎంతో ఆశపడ్డాను. కానీ ఓడిపోతే వాడికి ఎలా సమాధానం చెప్పాలోనని మరో ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. ఈరోజు వాడి పుట్టినరోజు. మీ శుభాకాంక్షలు కూడా కన్వేచేసాను.
ReplyDeleteసుభద్ర గారు మా సాగర్ తరపున మీకు థాంక్స్.
చాలా బాగుంది...ఓ చిన్నారి హృదాయాన్ని మీరు అర్థం చేసుకొని వ్యక్త పరచిన తీరు బాగుంది...సాగర్ కి జన్మ దిన శుభాకాంక్షలు
ReplyDelete