
ఇక్కడ మాయా లేదు మర్మం లేదు
కుట్రలు కుహకాలు కలికానికి కూడా లేవు
పండు వెన్నెలలాంటి నవ్వులే
కరచాలనాలతో మొదలయిన పరిచయం
కలసి నడిచే జీవనశైలిగా మారుతుంది!
నిరంతరం అలోచనల సంఘర్షణ-ఐక్యత
సూత్రంతో కట్టుబడి వుంటాం
వెన్నంటివుండే ఆయుధానికి పట్టిన
మురికిని వదిల్చే రోజువారీ పని
మా మెదళ్ళతో పాటే మనసుకూ వుంటుంది
అది మితృల చిరునవ్వులపై ప్రతిఫలిస్తుంది
నిత్యం మెడపై వేలాడే కత్తి పదును
మమ్మల్ని అప్రమత్తుల్ని చేస్తుంది
ఇక్కడ మాయాలేదు మంత్రం లేదు
ఆచరణ నుండి అనుభవం
అనుభవం నుండి జ్ణానం
జ్ణానం నుండి ఆచరణ
మా నడతను సరిచేస్తుంటాయి
పారే సెలయేళ్ళ గల గలలు
ఎగిరే పక్షుల రెక్కల కిల కి్లారావాలు
వీచే గాలిలోని అడవి పూల పరిమళం
జీవన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ
పదం పదం కలిసి సాగే పల్లవి అవుతుంది
ఇక్కడ కాచిన వెన్నెల వృధా కాదు
రేపటి సూర్యోదయానికి భరోసా...
కొంత వరకు మీతో ఏకీభవించలేను అలాగని మీ అభిప్రాయాన్ని కాదనలేను. కొన్ని ఆశయ పరంగా ఉన్నతంగా వున్నా అవి ఆచరణ దశలో వ్యక్తిత్వ పరిణతిని బట్టి ప్రబావితమౌతాయి [అని నా ఆలోచన, సాంసరిక జీవితంలోనే ఇరువురి నడుమ సఖ్యత ప్రశ్నార్థకమైనపుడు ఇంత సంఘటిత ప్రయత్నంలో ఎంత సంయమనం కావాలి, అది ఈ రోజుల్లో సాధ్యమా అన్నది నా అంశం]. బహుశా జనజీవన స్రవంతికి మరలినవారో లేక నిష్పక్షపాతంగా నిజాల్ని చెప్పగలిగేవారో తగునేమో ఇక్కడ వ్యాఖ్యానించను? అయినా కానీ మీ రచనలు చదివి మనసులో మాట పంచుకోవటం ఒక అలవాటు.
ReplyDeleteమీ మనసులో మాట చెప్పినందుకు థాంక్స్. ఆచరణకు దూరమైనవారు చేసే విమర్సలవలనన మరింట ఎడం పెరుగతతుందే తప్ప నిజం బయటకు రాదు. ఇన్ని వేల మైళ్ళ విస్తీర్ణంలో సమాంతరంగా ప్రయాణించగలౌగుతున్నారంటే సమన్వయం లేకపోతే సాద్యమా? ఆచరణలో పరిణతి ఆచరణ ద్వారానే కదా కలిగేది. వాలుకుర్చీ ఆలోచనలవలన ఏదీ సాధ్యం కాదు. దేనినైనా సాధించాలంటె శొధన నాళికలోంచే సాధ్యం .
ReplyDelete