
నిటారుగా నిలబడి గుండెలనిండుగా
ఊపిరి పీల్చుకొని
కాళ్ళు రెండూ నేలపై బలంగా అదిమి
మీ కళ్ళలో కళ్ళుపెట్టి చూడాలన్న
నా కోరిక ఈ తరానికి సాధ్యమా?
తరతరాలుగా నా భూమిని
నా సర్వాన్ని నీ హక్కుభుక్తం చేసుకొని
కోటి పడగల నాగుబామువై
భూమండలాన్ని చుట్టేసుకున్నావు...
అనాదిగా బానిసత్వపు సంకెళ్ళను
నా మెడలో వేసి నన్ను పాతాళంలోకి
నెట్టివేసి అధికారాన్ని అనుభవిస్తున్నావు...
కానీ...
అణచబడ్డ నా తరం అంతరంగ సునామీలోంచి
ఉద్భవించే పెనుతుఫాను తాకిడికి
నీ అధికార పీఠం తలకిందులవుతుంది...
అవమానాల ఊబిలోంచి
ఎర్రకలువ పూస్తుంది!
its...good.
ReplyDeleteఎర్రకలువకి కావాలంటే కానిదేదీ లేదు!
ReplyDeleteచీకట్లు తొలగిన ఆ తెలవారివెలుగులో ఎర్ర మందారమూ విరుస్తుంది. రేకు రేకున స్వేఛ్ఛాకిరణం వేయిక్రోసులు ప్రసరిస్తుంది.
ReplyDeleteఅవమానాల ఊబిలోంచి
ReplyDeleteఎర్రకలువ పూస్తుంది!
అద్బుతమైన అభివ్యక్తి. చాలా బాగుంది.