నేను కేర్మన్నంతనే
నా గొంతులో అమృతపు
చుక్కలు పోసి
పొత్తిళ్ళలో సేదదీర్చిన
నిన్ను ఎలా మరువగలనమ్మా
నీ వేలి చివరి ఆసరాతో
నీ అడుగులో అడుగునై
నేర్చానీ నడక
అమ్మా అన్న బీజాక్షరాలలోంచే
భాష నేర్చుకొన్నాను
నీ లాలిపాటలలోని
కరుణామయ పల్లవులే
నాకవిత్వం!
తండ్రీ నీ కష్టానికి ప్రతిరూపమే
యీ దేహం
నీ కనురెప్పల మాటున
రూపొందిన నా భవిష్యత్
చిత్రపటం నీకే అంకితం
మడమ తిప్పని నీ సాహస పోరాట
తత్త్వం మమ్మల్ని వెన్నంటి
ఉంటోంది
మీ పేగు ఋణం ఈ జన్మకు
తీరేనా?
(పేరెంట్స్ డే సందర్భంగా)
kavitha chaala bagundi.thallidandrulanu gurtu vunchukone pillalu ee kaalamlo chala thakkuvamandi vunnaru.
ReplyDeleteఇటువంటి సంస్కారం అలవడాలంటే అది ఆ తల్లితండ్రుల వలనే సాధ్యం. వారు ధన్య జీవులు మీ వంటి మరెందరికో మార్గ దర్శకులు.
ReplyDeleteచాలా బావుందండీ ....మీ తల్లితండ్రులకు మీరిచ్చిన కానుక !
ReplyDelete