Wednesday, July 8, 2009

ఎప్పుడైనా?

ఎప్పుడైనా గొంతులోంచి బిగ్గరగా అరిచి నీ ఎదురుగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించావా?
ఎప్పుడైనా నీవు ప్రయాణిస్తున్న పడవ ఆవలి ఒడ్డుకు చేరేలోపు సుడిలో చిక్కుకుందా?
ఎప్పుడైనా నీవు నదిలో దిగినపుడు నీ కాలికింద ఇసుక కోతకు గురై పీకల్లోతు నీటిలో మునిగి బయటపడ్డావ?
ఎప్పుడైనా మీ ఇల్లు తగలబడి కట్టుబట్టలతో మిగిలి మళ్ళి మొదలయ్యావా?
ఎప్పుడైనా గాలికి నీ ఇంటి పైకప్పు ఎగిరి, గోడలు కూలి ధారాపాతంగా కురుస్తున్న ముసురులో మూడురోజులు పస్తులున్నావా?
ఎప్పుడైనా సకాలంలో వర్షం కురవక ప౦టకొచ్చిన పొలం ఎండి పోయి ఏడాదంతా ఏమి చేయాలో పాలుపోని స్థితికి లోనయ్యావా?
ఎప్పుడైనా చేతిలో చిల్లిగవ్వ లేకుండా కడుపులో పేగులు ఉండ చుట్టుకొని నొప్పితో బాధ పడ్డావా?
ఎప్పుడైనా నీ ఇంట్లోకి చొరబడి నీ నుదుటిపై తుపాకీ గురిపెట్టబడి౦దా?
ఎప్పుడైనా నీ వీధిలో తుపాకి కాల్పుల హోరు వినబడిందా?
ఎప్పుడైనా అకారణంగా నీ పెడ రెక్కలు వెనక్కి విరిచికట్టి నీ డొక్కలో గుద్ది నీ మెడపై బలమైన చేతులు వేసి తోసుకుంటూ జీపెక్కించారా?
ఎప్పుడైనా కర్ఫ్యూ విధించిన వీధిలో రాల్లదాడి జరిగి ఎటు కదలలేని స్థితికి లోనయ్యావా?
ఎప్పుడైనా నీ వాళ్ళెవరైనా అత్యాచారానికో, హత్యకో గురై సాక్ష్యం చెప్పేవాడు లేక నీ ముందే వాడు కాలరేగారేసుకు తిరుగుతున్న స్థితికి గురయ్యావా?
ఎప్పుడైనా నీ వాళ్లు తప్పిపోయి ఎటుపోయారో తెలియక మానసిక క్షోభ అనుభవించావా?
ఇవన్నీ కాదు మిట్ట మధ్యాహ్నం నీరందక తీవ్రమైన దప్పికతో నాలుక పిడచ కట్టుకుపోయే స్థితికి లోనయ్యావా?
ప్రశ్నలలో ఒక్కటికి గురైనా నీకు దు:ఖం గురించి తెలుస్తుంది..
(ఇవన్ని సామాన్యుడికి నిత్య కృత్యమైనాయి)

4 comments:

  1. మీ 13 ప్రశ్నల్లో 3 నాకు స్వానుభవం. కానీ అవి అనుభవంలోకి రాక మునుపే దుఃఖం నా జీవితానికి పరిచయం చేయబడింది. ఎప్పుడైనా ఆలోచించే మనసుకి అనుభవం అవసరం కాదేమో? ఆ ఆలోచనల్లో పరిణితి చాలేమో?

    ReplyDelete
  2. ఉష గారు మీరన్నది నిజమే. కానీ నేడు మనిషి ప్రతిదాన్నీ తేలికగా తీసుకునే స్వభావాన్ని ప్రశ్నిద్దామని ఇలా అడిగాను. ఎవరికి ఏమైపోయినా పట్టించుకోని మనస్తత్వం పెరిగిపోయిన వాళ్ళనుద్దేసించి మాత్రమే.
    పద్మార్పితగారు మీ ప్రతిస్పందనకు థాంక్స్.

    ReplyDelete
  3. బాగుంది .. ఉష గారు అన్నట్టు.. ఆలోచించే మనసుకి అనుభవం అవసరం కాదేమో?

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...