
జీవితం ఎం. ఓ. ఫారంలోని
స్పేస్ ఫర్ కమ్యూనికేషనంత
కుదించుకుపోవడం
ఎంత విషాదమోగదా!
చిన్ని జాగాలోనే క్షేమ సమాచారాలు
పలకరించుకోవడాలు
చేసేంత మరుగుజ్జుతనం
ఎంత దౌర్భాగ్యం!
ఒకరినొకరు హృదయం విప్పి
పలకరించుకోలేనితనం
ప్రతిమాటకు ఏదోకనబడని
తెర అడ్డుపడుతుండడం
అంతా సవ్యంగా సాగిపోతుందని
అనుకోలేని వెన్నాడుతున్న
పిరికితనం
కనుచూపుమేరా చూసిన దృశ్యం
కంటివెనకాల అదృశ్యం
అంటీ ముట్టనట్టు కరచాలనం!
ఎందుకింత అబద్దం
రాజ్యమేలుతోంది!
మంచుతెర కమ్ముకుంటూ
గుండె కవాటాలను
బిగదీస్తోంది!!
చిన్ని జాగాలోనే క్షేమ సమాచారాలు
ReplyDeleteపలకరించుకోవడాలు
నిజమే కదా ..ఆలోచింప జేసే కవిత
మనసు గొంతు నొక్కి మనుగడ సాగించే మనుషులు అంత కన్నా ఏమి ఘనంగా మనగలరు, మిత్రమా? ఎక్కడో మీవంటి నూటికొకరు మనసు కలిపి సంభాషిస్తారు, వారి కొరకే ఈ ఆనంద పున్నములు ఆవేదనా అమాసలూను.
ReplyDeleteకొరడాలా ఛెళ్ళుమనిపించే వాక్యాలు.
ReplyDeleteఅద్బుతమైన ఇమేజ్
జీవితం ఎం. ఓ. ఫారంలోని
స్పేస్ ఫర్ కమ్యూనికేషనంత
కుదించుకుపోవడం
ఎంత విషాదమోగదా!
అవును మరి
డిస్ప్లేలో నంబరు చూసుకొని
టాక్ బటన్ నొక్కడమే కదా
సంభాషణంటే ఈ రోజుల్లో.
కొన్ని వాక్యాలు జీవితంలోని డొల్లతనాన్ని మెడలో వేసుకొని తిరుగుతాయి. వాటిని చదువుకొని మనల్ని మనం తడుముకొంటాం. మరింత సున్నితంగా మారతాం
ఆఫ్టర్ ఆల్ - సున్నితనాన్ని కోల్పోకుండా రాటుదేలటమే కదా జీవితం అంటే. అంతకు మించి కవిత్వాన్నించేం ఆశించాలి మనం.
కవిత చాలా బాగుంది
ఇదివరలో నే కామెంటిన అద్దంలో అదృశ్యం కవిత ఇప్పుడు మరలా చదూతుంటే మరింత బాగుంది.
భవదీయుడు
బొల్లోజు బాబా