Friday, April 1, 2016

ఇప్పటికి ఇంతే..

పదే పదే నువ్వలా అడుగుతూనే వుంటావు
ఈ ప్రమిద కింద నీడ దాటి రాలేవా అని

ఆ గాలికి ఎగిరిపోయిన గడ్డి కప్పు అటూ ఇటూ
చెదరి

మొన్నటి వానకు నానిన మట్టిగోడలుపై చారలుగా
మిగిలిన క్రీనీడలు

విరిగిన కంచెను ఆనుకొని ఎరుపు కాగితం పూల
మొక్క వంగిన కొమ్మలు

ఈ ఒంటరి ఆకాశం వీడిన వెన్నెల కాలుతున్న దేహపు కమురు
ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలియని ఓ 
అపస్మారకతలో చేజారిన కుంచె

ఇప్పటికి ఇంతే 
ఆ బాలుడు లేచి నీటిలోకి ఓ రాయిని విసిరాడు

రావి చెట్టు నీడ చెదిరింది 
పాయలుగా.....

12 comments:

  1. ఈ ఒంటరి ఆకాశం వీడిన వెన్నెల కాలుతున్న దేహపు కమురు
    ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలియని ఓ అపస్మారకతలో...అమాయకంగా తెలీదంటూ అధ్భుతం చెబుతారు.

    ReplyDelete
  2. నలువైపుల చీకటి తెరలు కమ్ముకుంటే చిన్న ప్రమిద దీపం దేదీప్యమై వెలుగు పంచుతుంది..
    నలువైపుల చిక్కగా కారుమబ్బులు కమ్ముకుంటే చిన్న చినుకు ఉపశమనమై మది పులకింపజేస్తుంది..
    మనసు భారమై వ్యథ అంతట కమ్ముకుంటే చిన్న పలకరింపు సాంత్వనై ఓలలాడిస్తుంది

    ~శ్రీ~

    ReplyDelete
  3. ఈ ప్రమిద కింద నీడ దాటి రాలేవా అని..ఈ సున్నితమైన ఆలోచనలు మీవే.

    ReplyDelete
  4. పదే పదే నువ్వలా అడుగుతూనే వుంటావు
    ఈ ప్రమిద కింద నీడ దాటి రాలేవా అని chaalaa nachindi naaaku.
    Baagundi gurujee..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...