Friday, April 15, 2016

నీళ్ళు....


కడవల కొద్దీ నీళ్ళు
కలలో కళ్ళలో

నదిలో పాదాలు
మండుతూ ఇసుకలో

గిర్రున తిరుగుతూ
నేల రాలిన కాకి

ఎవరి కంట్లోను
తడిలేనితనం

గుండె ఆవిరై 
నెత్తురు నల్లని మరకగా

నాచు బారిన ఈ 
గోడను వేలితో గీస్తూ

నీళ్ళింకిన మొదలుతో
ఆకు రాలిన బూరుగుమాను

దేహం ఉష్ణ మండల కాసారం

రా
లి
పూవొకటి తారుపై మరుగుతూ

ము
లు
ఉబ్బిన అనాధ రహదారి పక్కన

ఒక తడి మాటను
చిలికి పో!

రాత్రి నీకిన్ని
నీళ్ళు దానం చేస్తుంది...

6 comments:

  1. నీళ్ళు.. ఈ వనరం లేకుంటే ప్రాణం నిలువదు.. ప్రాణమున్న ప్రతి జీవికి ఆధారం..

    స్నేహం.. ఆదరణ.. కుటుంబం.. ఇవన్ని కూడా మనిషికి కావలసిన అత్యవసర వనరులని మీ కవితముఖంగా చెప్పదల్చుకున్నాను సర్..

    ReplyDelete
  2. నాచు బారిన ఈ గోడను వేలితో గీస్తూ...

    ReplyDelete
  3. వేసవిలో నీళ్ళకి ఇక్కట్లు మొదలు..

    ReplyDelete
  4. మీ అక్షరదాహాన్ని తీర్చడం ఎవరి తరం చెప్పండి.
    ఆర్దతాక్షరాలతో నన్ను ఎప్పుడూ అబ్బుర పరుస్తుంటారు.

    ReplyDelete
  5. నీటి ఎద్దడిలో ముఖం పై కాసిన్ని నీళ్ళు చిలకరించినట్లు మీ కవిత

    ReplyDelete
  6. బాగుంది సార్

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...