పదే పదే నువ్వలా అడుగుతూనే వుంటావు
ఈ ప్రమిద కింద నీడ దాటి రాలేవా అని
ఆ గాలికి ఎగిరిపోయిన గడ్డి కప్పు అటూ ఇటూ
చెదరి
మొన్నటి వానకు నానిన మట్టిగోడలుపై చారలుగా
మిగిలిన క్రీనీడలు
విరిగిన కంచెను ఆనుకొని ఎరుపు కాగితం పూల
మొక్క వంగిన కొమ్మలు
ఈ ఒంటరి ఆకాశం వీడిన వెన్నెల కాలుతున్న దేహపు కమురు
ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలియని ఓ
అపస్మారకతలో చేజారిన కుంచె
ఇప్పటికి ఇంతే
ఆ బాలుడు లేచి నీటిలోకి ఓ రాయిని విసిరాడు
రావి చెట్టు నీడ చెదిరింది
పాయలుగా.....
ఈ ఒంటరి ఆకాశం వీడిన వెన్నెల కాలుతున్న దేహపు కమురు
ReplyDeleteఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలియని ఓ అపస్మారకతలో...అమాయకంగా తెలీదంటూ అధ్భుతం చెబుతారు.
Thank you Prerana garu
Deleteనలువైపుల చీకటి తెరలు కమ్ముకుంటే చిన్న ప్రమిద దీపం దేదీప్యమై వెలుగు పంచుతుంది..
ReplyDeleteనలువైపుల చిక్కగా కారుమబ్బులు కమ్ముకుంటే చిన్న చినుకు ఉపశమనమై మది పులకింపజేస్తుంది..
మనసు భారమై వ్యథ అంతట కమ్ముకుంటే చిన్న పలకరింపు సాంత్వనై ఓలలాడిస్తుంది
~శ్రీ~
Thank you Sri garu
Deleteఈ ప్రమిద కింద నీడ దాటి రాలేవా అని..ఈ సున్నితమైన ఆలోచనలు మీవే.
ReplyDeleteThank you Srujana garu
Deleteమరో చక్కని కవిత
ReplyDeleteThank you Telugammaai garu
DeleteThank you Telugammaai garu
Deleteపదే పదే నువ్వలా అడుగుతూనే వుంటావు
ReplyDeleteఈ ప్రమిద కింద నీడ దాటి రాలేవా అని chaalaa nachindi naaaku.
Baagundi gurujee..
Thank you Sir...
DeleteThank you Sir...
Delete