Friday, April 15, 2016

దాహంతో.......


ఎదురుగా సగం విరిగిన కూజాలోంచి
కొద్దిగా నీళ్ళు ఒంపుకుని
కాసిన్ని గొంతులో పోసుకుని
అలా నీ కనురెప్పలపై చల్లి

మిగిలిన
ఆ కాసిన్ని ఈ మూల బోగన్ విల్లియాపై
చిలికిన ఆ అరచేయినలా
నుదుటిపై వేసుకుని

నేలపై అలా ఒరిగి సేద దీరే ఈ 
మధ్యాహ్నం నువ్వలా
ఒంటరిగా ఎండ ధనరులో 
ఆ చువ్వల నీడల మాటున
దాహంతో ఇగిరిన మందారంలా
వడలి ముడుచుకుని సన్నగా మూలుగుతూ

కంపిస్తున్న దేహంతో....

3 comments:

  1. ఆర్ద్రత నిండిన భావ కుసుమం
    మండే ఎండకు కందకుండా కాచుకోండి

    బాగుంది భావం.. కవితను ఒకమారు పరిశిలిస్తే చాలు భావం బహిర్గతం అయ్యింది కుమార్ వర్మ సర్..

    ReplyDelete
  2. వేసవి వచ్చింది ఇక్కట్లు తెచ్చింది
    దాహం వేస్తోంది గొంతెండిపోతోంది
    నీళ్ళు పట్టాలా వద్దా..

    చెరువు ఇంకింది చమట పట్టింది
    సుడి గాలి వీచింది దుమ్ము ధూళి రేగింది
    నీళ్ళు పట్టాలా వద్దా..

    ఎండ బెడిసి కొట్టింది ముఖం కంది పోయింది
    గొడుగు ఎగిరింది వడదెబ్బ కొట్టింది
    నీళ్ళు పట్టాలా వద్దా..


    ~శ్రీ~

    ** చేయాలా వద్దా అనే పాటకు గిమిక్కు ఇది కుమార్ వర్మ గారు..
    వేసవి తాపం నుండి ఉపశమనం ఎలాగో ఏమిటో..
    కొబ్బరి బొండాలు నిమ్మ చెక్కలు మజ్జిగలు ఘటోత్కచ ప్రయాస.. శ్రీ కృష్ణ పరమాత్మ

    ReplyDelete
  3. విరిగిన కూజా అంటూ...భావంలో కూడా దరిద్రాన్ని మీరే చూపగలరు.
    అందుకే మీ కవితలు అంత ప్రత్యేకం కవివర్మగారు.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...