కొన్ని సాయంత్రాలకు రూపం వుండదు
కడవలకొద్దీ కన్నీళ్ళు బూడిదలో కలిసి
దేహమంతా కూరుకుపోతుంది!
అక్కడక్కడా మిగిలిన గురుతులన్నీ
దర్వారాలుగా కుప్పకూలిపోతాయి!
రహదారులన్నీ చీలిపోయి పగిలిన
బీళ్ళలా నోరుతెరుచుకుంటాయి!
ఒక్కసారిగా ఆకాశం ధూళి మేఘంలా
విరుచుకుపడి భూస్థాపితం చేస్తుంది!
తవ్విన కొద్దీ గుండె పగుళ్ళు మధ్య
నెత్తుటి ఇటుకల శిధిల విలాపం!
నువ్వంటావు కన్న పేగునెవరో
కసిగా తెంపివుంటారా అని!
అవును
ఆత్మలన్నీ సామూహిక దహనకాండలో
కరిగిపోయి దు:ఖావరణాన్ని మిగిల్చాయి!!
ఆత్మలన్నీ సామూహిక దహనకాండలో
ReplyDeleteకరిగిపోయి దు:ఖావరణాన్ని మిగిల్చాయి! :-(
రూపం లేకపోతేనేం జీవం ఉంటే చాలదా
ReplyDelete